Lavanya Tripathi: పెళ్లి తర్వాత ఫస్ట్ సినిమాను అనౌన్స్ చేసిన మెగా కోడలు.. సతీలీలావతిగా లావణ్య.. హీరో ఎవరంటే?
మెగా కోడలు వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి ఆదివారం (డిసెంబర్ 15) తన పుట్టిన రోజు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా పలువురు కుటుంబీకులు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొణిదెల వారి కోడలికి బర్త్ డే విషెస్ చెప్పారు.
వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపొందనుంది. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం (డిసెంబర్ 15),లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఆమెకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసింది. ‘సతీ లీలావతి’ చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్, ఎగ్జయిటింగ్ కథాంశంతో మెప్పించటానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా, బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా.. కోసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్‌గా, సతీష్ సూర్య ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా సతీ లీలావతి సినిమా హీరో,ఇతర క్యాస్టింగ్స్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్.
కాగా గతేడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది లావణ్య. ఆ తర్వాత సుమారు ఏడాదిపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దీంతో లావణ్య సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందంటూ కూడా నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. కాగా ఈ సినిమాతో కొణిదెల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ఉపయోగించడం విశేషం.
లావణ్యకు వరుణ్ తేజ్ బర్త్ డే విషెస్..
Happy birthday baby!♥️
You bring so much joy and peace to my life. Every day, every hour & every memory is more beautiful with you in it.
Love you!😘
P.S-You’re the only one who can ever get me to dance!@Itslavanya pic.twitter.com/Z2hRLhgt55
— Varun Tej Konidela (@IAmVarunTej) December 15, 2024
సతీలీలావతి సినిమాలో లావణ్య…
Extremely excited to be a part of this project! This story caught my attention with its amazing write-up and solid team. I’m thrilled to be starting this next year what a fantastic way to kick off the year! . .#tatinenisatya @MickeyJMeyer #binendramenon #kosanamvithal… pic.twitter.com/D0KIddRreI
— Lavanyaa konidela tripathhi (@Itslavanya) December 15, 2024
సతీలీలావతి టైటిల్ రివీల్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.