Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి.. ఒక్కటవుతున్న వేళ కిర్రాక్ స్టెప్స్

Telangana: ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి.. ఒక్కటవుతున్న వేళ కిర్రాక్ స్టెప్స్

Ram Naramaneni

|

Updated on: Dec 15, 2024 | 4:16 PM

ఇటలీ అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ఒకటవ్వబోతున్నారు. ఈ క్రమంలో వధువు కుటుంబ సభ్యులంతా స్థానికంగా సందడి చేస్తున్నారు. భారత్ చాలా బాగుందని, ఇక్కడి వంటకాలు, మనుషులు,ఆచారాలు, వ్యవహారాలు నచ్చాయని వారు చెబుతున్నారు.

ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి.. మనసులు కలిశాయి.. వాళ్ల పెళ్లికి పెద్దలు సై అన్నారు.. ఇంకేముంది అచ్చ తెలుగు ఆచార సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకలు చకచకా జరిగి పోతున్నాయి. 18న పెళ్లి వేడుక ఉండగా శనివారం సాయంత్రం సంగీత్ నిర్వహించారు. ఈ వేడుకలో ఇటలీ అతిధులు తెగ సందడి చేశారు.. ఖండాంతరాలు దాటిన ఆ పెళ్లి సంబరాలను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌కు చెందిన కొడిపాక సూర్యప్రీతం ఉన్నత చదువుల కోసం లండన్‍  వెళ్లాడు.. ఈ క్రమంలో తనతో చదువుతున్న ఇటలీకి చెందిన మార్ట ఫ్రిట్టెల్‌తో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం కాస్తా… ప్రేమగా మారడంతో… ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి.. వివాహ బంధంతో  ఏకమవవబోతున్నారు. ఈనెల 18న వరంగల్‍ నగరంలోని ఓ ఫంక్షన్‍హాల్లో సంప్రదాయ పద్ధతిలో వివాహానికి ఏర్పాట్లు చేశారు.. పెళ్లికి ముందు నిర్వహించిన నిశ్చితార్థం, సంగీత్‍ వేడుకలో అమ్మాయి, అబ్బాయితో పాటు ఇటలీ నుంచి వచ్చి న వధువు ఫ్యామిలీ సభ్యులంతా లోకల్‍ మాస్‍ పాటలకు స్టెప్పులు వేశారు. వారిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Dec 15, 2024 04:16 PM