Rajinikanth: మరోసారి మంచి మనసు చాటుకున్న తలైవా.. అన్నాత్తై టెక్నీషియన్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్‌..

తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ నటించిన 'అన్నాత్తై (తెలుగులో పెద్దన్న)' దీపావళి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది

Rajinikanth: మరోసారి మంచి మనసు చాటుకున్న తలైవా.. అన్నాత్తై టెక్నీషియన్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్‌..

Updated on: Dec 24, 2021 | 7:03 PM

తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ నటించిన ‘అన్నాత్తై (తెలుగులో పెద్దన్న)’ దీపావళి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ఈ క్రమంలో తనకు భారీ హిట్‌ ఇచ్చిన దర్శకుడు శివకు కొన్ని రోజుల క్రితం బంగారు చెయిన్‌ను బహుమతిగా అందించారు రజనీకాంత్‌. కాగా ఈ సినిమా రిలీజై 50 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకు పనిచేసిన సభ్యులందరికీ మర్చిపోలేని గిఫ్ట్స్‌ ఇచ్చారు తలైవా. ‘అన్నాత్తై’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ డి. ఇమాన్‌తో పాటు ప్రధాన టెక్నీషియన్లందరికీ బంగారు చెయిన్లను బహుమతిగా అందించారు. ఈ ఫొటోలను ఇమాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుని మురిసిపోయాడు. దీంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి.

కాగా ‘అన్నాత్తై’ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేశ్‌ రజనీ సోదరి పాత్రలో కీర్తి సురేశ్‌ సందడి చేసింది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్‌ భారీగా కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా రజనీ అభిమానులు తమ అభిమాన హీరోను సిల్వర్‌ స్ర్కీన్‌పై చూడడానికి థియేటర్లకు క్యూ కట్టారు. కాగా సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన ‘అన్నాత్తై’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.240 కోట్ల కలెక్షన్లను రాబట్టిందని సమాచారం. కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా విడుదలైంది.

Also Read:

Fertilisers: అన్నదాతలకు శుభవార్త.. విదేశీ ఎరువుల రాయితీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం !

83 Movie: అమ్మా ప్రపంచకప్‌ గెలిచేశాం.. 83 సినిమా సక్సెస్‌పై రణ్‌వీర్‌ సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌..

చిన్నతనంలో తన స్నేహితుడితో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?