Director Raghuram: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కామెర్లతో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి..

రఘురామ్ అకాల మరణంతో తమిళ్ ఇండస్ట్రీ దిగ్ర్భాంతికి గురైంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Director Raghuram: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కామెర్లతో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి..
Music Director Raghuram

Updated on: Oct 30, 2022 | 6:52 AM

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘురామ్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో తుదిశ్వాస విడిచారు. రఘురామ్ అకాల మరణంతో తమిళ్ ఇండస్ట్రీ దిగ్ర్భాంతికి గురైంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ సురేష్ సంగయ్య తెరకెక్కించిన ఒరు కిదయిన్ కరుణై మను చిత్రానికి రఘురామ్ సంగీతం అందించారు. ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్ కాగా.. రఘురామ్ కు గుర్తింపు వచ్చింది. అలాగే డైరకె్టర్ సురేష్ సంగయ్య తెరకెక్కిస్తున్న సత్య సోతానై చిత్రాకి కూడా మ్యూజిక్ అందించారు.

ఇవి కూడా చదవండి

రివైండ్, ఆసై తమిళ చిత్రాలకు సంగీతం అందించారు. రఘురామ్ మృతితో తమిళ్ చిత్రపరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. యువ సంగతి మరణం పట్ల సినీ ప్రముఖులు.. స్నేహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు