Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ.. పొలిటికల్‌ ఎంట్రీ గురించి విశాల్ ఏమన్నారంటే..

| Edited By: Ravi Kiran

Jul 02, 2022 | 7:01 AM

Vishal: 2024 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు పోటీగా కుప్పం నియోజకవర్గం నుంచి నటుడు విశాల్‌ (Vishal) బరిలోకి దిగుతున్నట్లు బాగా ప్రచారం సాగుతోంది..

Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ.. పొలిటికల్‌ ఎంట్రీ గురించి విశాల్ ఏమన్నారంటే..
Vishal
Follow us on

Vishal: 2024 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు పోటీగా కుప్పం నియోజకవర్గం నుంచి నటుడు విశాల్‌ (Vishal) బరిలోకి దిగుతున్నట్లు బాగా ప్రచారం సాగుతోంది. సోషల్‌ మీడియాలోనూ ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ఈక్రమంలో తన పొలిటికల్‌ ఎంట్రీపై వస్తోన్న పుకార్లపై విశాల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వస్తున్నానని, కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాననే పుకార్లు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఖండిస్తున్నాను. రాజకీయాలకు సంబంధించి నన్ను ఇప్పటివరకూ ఎవరూ కలవలేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ప్రస్తుతం నేను సినిమాలతో బిజీగా గడుపుతున్నా. ఏపీ రాజకీయాల్లోకి రావాలని, చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం నాకు లేదు’ అని తేల్చిచెప్పాడీ కోలీవడ్‌ స్టార్‌ హీరో.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సామాన్యుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విశాల్‌. ప్రస్తుతం లాఠీ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. నటి సునయన హీరోయిన్‌గా నటిసస్తోంది.వినోద్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు తుప్పరివాలన్‌2 (తెలుగులో అభిమన్యుడు2), మార్క్‌ ఆంటోని చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నాడీ కోలీవుడ్‌ హీరో.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..