
Khiladi Movie Update: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ‘ఖిలాడి’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమాలోని కీలక పాత్రలను ఒక్కోక్కటిగా విడుదల చేస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే రవితేజకు విలన్‌కు విలన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇటీవల వెల్కమ్ గేమ్ ఛేంజర్ అంటూ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ ఫోటోను షేర్ చేసింది యూనిట్. తాజాగా ఈ మూవీలో బీటౌన్ యాక్టర్ నికితిన్ ధీర్ నటించనున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించింది టీం.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రవితేజకు జోడిగా మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. హావీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.
Also Read:
దుబాయ్ షార్జా మెలిహా చారిత్రక ఎడారిలో ‘సర్కార్ వారి పాట’ టీం.. ఫోటోలను షేర్ చేసిన మహేష్..