AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash Fan Suicide: అభిమాని ఆత్మహత్య.. ఎమోషనల్‌ అయిన కేజీఎఫ్‌ హీరో యశ్‌.. ఫ్యాన్స్‌ నుంచి ఆశించేది ఇది కాదంటూ..

Yash Become Emotional On Fan Sucide: కేజీఎఫ్‌ హీరో యశ్‌ అభిమాని ఆత్మహత్య వ్యవహారం సంచలనం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ (25) అనే వ్యక్తి ఇటీవల ఉరేసుకొని ఆత్మహత్యకు..

Yash Fan Suicide: అభిమాని ఆత్మహత్య.. ఎమోషనల్‌ అయిన కేజీఎఫ్‌ హీరో యశ్‌.. ఫ్యాన్స్‌ నుంచి ఆశించేది ఇది కాదంటూ..
Narender Vaitla
|

Updated on: Feb 19, 2021 | 2:12 PM

Share

Yash Become Emotional On Fan Suicide: కేజీఎఫ్‌ హీరో యశ్‌ అభిమాని ఆత్మహత్య వ్యవహారం సంచలనం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ (25) అనే వ్యక్తి ఇటీవల ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు రామకృష్ణ రాసిన లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘తల్లికి మంచి కొడుకుగా, అన్నయ్యకు మంచి సోదరుడిగా మారలేకపోయాను. చివరికి తన ప్రేమను కూడా గెలవలేకపోయాను. ఇక జీవితంలో సాధించడానికి ఏమీ లేదు’ అంటూ రామకృష్ణ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇదిలా ఉంటే ఈ లేఖలో యశ్‌తో పాటు కర్ణాటక మాజీ సీఎం సిద్ద రామయ్యలు అంటే తనకు ఎంతో అభిమానమని రామకృష్ణ పేర్కొన్నాడు. దీంతో అభిమాని మరణించిన వార్త తెలుసుకున్న యశ్‌ ట్విట్టర్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. ‘అభిమానుల అభిమానమే మాకు బలం, మాండ్యా రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిది. అయితే తాము అభిమానుల నుంచి ఆశించేది ఇది కాదని, ఈలలు, చప్పట్లు మాత్రమే తాము కోరుకుంటామని’ రాసుకొచ్చాడు. ఇక రామకృష్ణ అంత్యక్రియలకు సిద్ద రామయ్యలు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Also Read: వాహనదారులకు హెచ్చరిక.. సైబరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం.. ఇక నుంచి అది లేకుండా రోడ్డెక్కారో లైసెన్స్ రద్దే..