Prashanth Neel: ఆస్పత్రి నిర్మాణం కోసం భారీ విరాళమిచ్చిన కేజీఎఫ్‌ డైరెక్టర్.. గర్వంగా ఉందన్న మాజీ మంత్రి రఘువీరా

Andhra Pradesh: కేజీఎఫ్‌ (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) పెద్ద మనసు చాటుకున్నారు. తన తండ్రి 75వ జయంతిని పురస్కరించుకుని..

Prashanth Neel: ఆస్పత్రి నిర్మాణం కోసం భారీ విరాళమిచ్చిన కేజీఎఫ్‌ డైరెక్టర్.. గర్వంగా ఉందన్న మాజీ మంత్రి రఘువీరా
Prashanth Neel

Updated on: Aug 16, 2022 | 8:29 AM

Andhra Pradesh: కేజీఎఫ్‌ (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) పెద్ద మనసు చాటుకున్నారు. తన తండ్రి 75వ జయంతిని పురస్కరించుకుని ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి (Raghu Veera Reddy) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మరి ప్రశాంత్‌ నీల్‌కి రఘువీరారెడ్డికి సంబంధమేంటనుకుంటున్నారా? ఈ కేజీఎఫ్‌ డైరెక్టర్‌ మరెవరో కాదు.. రఘువీరా రెడ్డి సోదరుడు సుభాష్‌ రెడ్డి కుమారుడే.

కాగా ప్రశాంత్ నీల్ పుట్టి పెరిగింది బెంగుళూరులోనే అయినా.. అతని స్వగ్రామం అనంతపురం జిల్లా నీలకంఠాపురం. అతని అసలు పేరు కూడా ప్రశాంత్‌ నీలకంఠాపురం. అయితే దానిని ప్రశాంత్‌ నీల్‌గా మార్చుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే ప్రశాంత్ తండ్రి సుభాష్ రెడ్డి నీలకంఠాపురం చనిపోయారు. నీలకంఠాపురంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. అందుకే తరచూ ఇక్కడికి వస్తున్నాడీ స్టార్‌ డైరెక్టర్‌. కేజీఎఫ్‌ 2 విడుదల రోజు కూడా స్వగ్రామానికి వచ్చి తండ్రి సమాధిని దర్శించుకున్నారు నీల్‌. అక్కడ తనకు బంధువులు కూడా ఉన్నారు. ఈక్రమంలో ఆగస్టు 15న సుభాష్ రెడ్డి జయంతి కావడంతో సోమవారం మరోసారి నీలకంఠాపురంలో పర్యటించారు. తండ్రి 75వ జయంతిని పురస్కరించుకుని నీలకంఠాపురంలోఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రశాంత్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. స్టార్‌ డైరెక్టర్ విశాల హృదయాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్న ప్రశాంత్ ఎన్టీఆర్‌, చెర్రీలతోనూ సినిమాలు చేయడానికి కమిట్‌ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..