KGF 2 Trailer: కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్ తొలి పార్ట్ ఎంతటి ఘన వియజాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు. కేజీఎఫ్ చిత్రం కూడా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం వస్తోన్న పార్ట్2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యావత్ దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.
తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాస్తోంది. ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. కేవలం ఒక్క రోజులోనే కోటికిపైగా వ్యూస్‌తో దుమ్మురేపింది. ఈ ట్రైలర్‌కి తెలుగులో 20 మిలియన్స్, హిందీలో 51 మిలియన్స్, తమిళంలో 12 మిలియన్స్, మలయాళంలో 8 మిలియన్ వ్యూస్, కన్నడలో 18 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ఏకైక చిత్రంగా కేజీఎఫ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేజీఎఫ్ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పడానికి బద్దలవుతోన్న ఈ రికార్డులే నిదర్శనం.
Records.. Records.. Records..?
Rocky don’t like it, He avoids, But Records likes Rocky!
He Cannot avoid it.??? + ??????? ????? ?? ?? ????? ♥️?
Kannada: 18M
Telugu: 20M
Hindi: 51M
Tamil: 12M
Malayalam: 8M#KGFChapter2Trailer #KGFChapter2 pic.twitter.com/n6pspljdxj— Hombale Films (@hombalefilms) March 28, 2022
ఇక గురువారం మధ్యాహ్నం నాటికి కేజీఎఫ్ 2 ట్రైలర్ రెండున్నర కోట్లకుపైగా వ్యూస్ దక్కించుకొని మరికొన్ని రికార్డులను తిరగరాయడానికి సిద్ధంగా ఉంది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన విషయాన్ని కేజీఎఫ్ చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా తెలుపుతూ.. ‘రాఖీకి రికార్డులు నచ్చవు, అతను వాటిని పట్టించుకోడు. కానీ రికార్డులు రాఖీని ఇష్టపడతాయి, అతన్ని వదలవు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు.
Also Read: Viral Video: ఎవరైతే నాకేంటి.. అడవిలో సింహాల గుంపును వణికించిన హానీబాడ్జర్..
Viral Video: కర్మ సిద్ధాంతం నిజమేనని ఈ వీడియో చూస్తే మీరూ నమ్ముతారు.