AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన్మథుడుతో ‘మహానటి’..!

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్‌లో శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా రిలీజైన షూటింగ్ ఫొటోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో సమంతా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె సంబంధించిన షూట్ కూడా పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ ఈ సినిమాలో స్పెషల్ […]

మన్మథుడుతో 'మహానటి'..!
Ravi Kiran
|

Updated on: May 07, 2019 | 11:57 AM

Share

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్‌లో శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా రిలీజైన షూటింగ్ ఫొటోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో సమంతా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె సంబంధించిన షూట్ కూడా పూర్తయింది.

తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ ఈ సినిమాలో స్పెషల్ పాత్ర చేయనుందని సమాచారం. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సీన్స్‌ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ‘మన్మధుడు’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తోంది.