రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘కాంతార‘. కన్నడ చిత్రమైన కాంతార హోంబలే ఫిలిం సంస్థ నిర్మించింది. గతంలో బంపర్ హిట్ మువీ అయిన కేజీఎఫ్‌ను కూడా ఈ సంస్థనే నిర్మించింది. సప్తమి గౌడ, హీరో రిషబ్ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. గీతా ఫిల్మ్ డిస్టిబ్యూషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 15న కాంతార ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే ఈ మువీ విడుదలైనప్పటి నుంచి అంచనాలకు మించి అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. సినీ ప్రియుల కళ్లన్నీ ఈ చిత్రంవైపే. ఒక డబ్బింగ్ సినిమా ఇంతటి ఆదరణ పొందడం సినీ చరిత్రలో అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా కాంతార మువీలోని ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాయని చెప్పాలి. ఏకంగా 9 టాలీవుడ్ సినిమాలు కాంతార దాటికి నెగ్గలేకపోయాయి. నేటికి సరిగ్గా 20వ రోజు. అయినా ఎంత మాత్రం క్రేజ్ తగ్గకుండా తెలుగునాట దూసుకుపోతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే 48 కోట్ల గ్రాస్ 25 కోట్ల షేర్ దాటేసింది. ఓవర్సీస్‌లో కెజిఎఫ్ తర్వాత రెండు మిలియన్ మార్క్ అందుకున్న రెండో శాండల్ వుడ్ మూవీగా కాంతార రికార్డు నెలకొల్పింది. ఇప్పటికీ వారాంతాల్లో ప్రేక్షకుల ఎంపిక పూర్తిగా కాంతార కంట్రోల్‌లోనే ఉన్నాయి. అటు బాలీవుడ్ కొత్త చిత్రాలైన మిలీ, ఫోన్ భూత్‌లు సైతం కాంతారను దెబ్బకు హడలెత్తిపోతున్నాయి. దసరా కానుకగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏ భాషలోనూ రాకపోవడం కాంతారకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయ్యింది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం కర్ణాటక నాట కెజిఎఫ్‌ని మించిపోయింది. నిజానికి ఇలాంటి చిత్రాలు మనకు కొత్తేమీకాకపోయినా.. కథలోని సహజత్వం, దైవత్వం చొప్పించిన తీరు ప్రేక్షకుడ్ని కదలకుండా అట్టే కట్టిపెడుతుంది. కన్నడ కాంతార రిలీజై నేటికి 39 రోజులైంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు బాక్సీఫీస్ వద్ద కాంతార మువీ దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది. కాంతార ఓటిటి ప్రీమియర్ నవంబర్ 18న ఉండవచ్చని సమాచారం.
మరిన్ని ఎంటర్టైన్ మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.