Sapthami Gowda: కాంతారా కోసం కష్టమైనా ఆ పని చేసిందట.. హీరోయిన్‌ డెడికేషన్‌పై సర్వత్రా ప్రశంసలు

|

Oct 20, 2022 | 11:18 AM

కన్నడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీ కాంతారా కోసం హీరోయిన్‌ సప్తమి గౌడ కూడా ఓ కష్టమైన పని చేసింది. సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా సహజంగా కనిపించేందుకు రెండు వైపులా ముక్కు కుట్టించుకుందట. ఈ సినిమా చేసే వరకు ఆమె అసలు ముక్కు కుట్టించుకోలేదట.

Sapthami Gowda: కాంతారా కోసం కష్టమైనా ఆ పని చేసిందట.. హీరోయిన్‌ డెడికేషన్‌పై సర్వత్రా ప్రశంసలు
Sapthami Gowda
Follow us on

సినిమాల్లో పాత్రల కోసం ఒక్కొక్కరు ఒక్కోలా మారిపోతుంటారు. క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంత కష్టమైనా భరిస్తుంటారు. సైజు జీరో కోసం నిజంగానే భారీగా బరువు పెరిగి సినిమా పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంది. తాజాగా కన్నడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీ కాంతారా కోసం హీరోయిన్‌ సప్తమి గౌడ కూడా ఓ కష్టమైన పని చేసింది. సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా సహజంగా కనిపించేందుకు రెండు వైపులా ముక్కు కుట్టించుకుందట. ఈ సినిమా చేసే వరకు ఆమె అసలు ముక్కు కుట్టించుకోలేదట. అయితే అమ్మాయిలు ముక్కు, చెవులు కుట్టించుకుంటే మంచిదని రిషబ్‌ శెట్టి సలహా ఇవ్వడం, సినిమాలో పాత్ర కూడా డిమాండ్‌ చేయడంతో ముక్కు కుట్టించుకుందట. సాధారణంగా అమ్మాయిలు ఒకవైపే ముక్కు కుట్టించుకుంటారు. అయితే సప్తమి గౌడ మాత్రం రెండు వైపులా ముక్కు కుట్టించుకుంది. కాగా కాంతార సినిమా తర్వాత సప్తమి పాపులారిటీ పెరిగిపోయింది. సోషల్‌ మీడియాలోనూ ఫాలోవర్లు పెరిగిపోయారు. రెండు ముక్కు పుడకలు ధరించి ఆమె షేర్‌ చేస్తోన్న ఫొటోలకు ఫ్యాన్స్‌ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక కాంతారా సినిమా విషయానికొస్తే.. కన్నడలో 200 కోట్లకు చేరువవుతోంది ఈ సినిమా. ఇక తెలుగు, హిందీ, మలయాళంలోనూ దండిగా వసూళ్లు రాబడుతోంది. ఈనెల 15న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజైన ఈ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా రూ.8.24 కోట్ల షేర్‌ను రాబట్టి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కాగా కర్ణాటకలోని కంబ్లా, భూతకోలా సాంప్రదాయం, అటవీ సంస్కృతిని నేపథ్యంగా తీసుకుని యాక్షన్‌ థ్రిల్లర్‌గా కాంతారాను తెరకెక్కించాడు హీరో రిషబ్‌ శెట్టి. కిషోర్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. కేజీఎఫ్‌ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిలిమ్స్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..