Puneeth Raj Kumar: ముగిసిన పునీత్ అంత్యక్రియలు.. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిసాయి. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య ఇవాళ ఉదయం కన్నడ సూపర్ స్టార్..

Puneeth Raj Kumar: ముగిసిన పునీత్ అంత్యక్రియలు.. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు
Puneeth Raj Kumar Last Jour

Updated on: Oct 31, 2021 | 7:58 AM

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిసాయి. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య ఇవాళ ఉదయం కన్నడ సూపర్ స్టార్ కు తుది వీడ్కోలు పలికారు. కంఠీరవ స్టూడియోలో తల్లిదండ్రులు సంధివద్దనే పునీత్ అంతిమ సంస్కరాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. రాఘవేంద్ర కుమారుడు విన‌య్ తలకొరివి పెట్టాడు.   కుటుంబ సభ్యులు, కర్ణాటక సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పునీత్ రాజ్ కుమార్ కు కన్నీటి మధ్య తుది వీడ్కోలు పలికారు.  ఈ అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉదయం 4.40 కే  మొదలైన అంతిమ యాత్ర 16 కిలోమీటర్ల మేర జరిగింది.  పునీత్ ను చివరిసారి దర్శించుకోవడానికి కరోనా ని కూడా లెక్కచేయకుండా అభిమానులు బారులు దీరి తమ అభిమాన హీరోని చివరిసారి దర్శించుకున్నారు.

తల్లి పార్వతమ్మ, తండ్రి రాజ్ కుమార్ ల సమాధివద్దనే పునీత్ కు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. కంఠీరవ స్టూడియోలో అంత్యక్రియలు జరిగాయి.  పునీత్ పార్ధీవ దేహానికి కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై సెల్యూట్ చేశారు.

పునీత్ రాజ్‌కుమార్‌కు ఇద్ద‌రు కూతుళ్లు వందిత, ధృతి. కొడుకులు లేనందున పునీత్ త‌ల‌కొరివిని ఆయన అన్న కొడుకు విన‌య్ రాజ్‌కుమార్ పెట్టాడు. పునీత్ రాజ్ కుమార్ అకాల మృతి దక్షిణాది సినీ పరిశ్రమనే కాదు అభిమానులను కూడా తీవ్ర శోక సంద్రంలో ముంచింది.