AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి.. కంటెస్టెంట్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. లోపలికి వెళ్లి మరి..

Varthur Santosh Arrest: కన్నడలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ సీజన్ 10లో కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్ అరెస్టవ్వడం సంచలనంగా మారింది. కన్నడ బిగ్‌బాస్‌ రియాల్టీషోలో ఉండగానే.. వర్తుర్‌ సంతోష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేసింది. బిగ్‌బాస్‌షోలో పులిగోరు ధరించి పాల్గొనడంతో సంతోష్‌పై పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి.

Bigg Boss: బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి.. కంటెస్టెంట్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. లోపలికి వెళ్లి మరి..
Varthur Santosh Arrest
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 23, 2023 | 5:06 PM

Varthur Santosh Arrest: కన్నడలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ సీజన్ 10లో కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్ అరెస్టవ్వడం సంచలనంగా మారింది. కన్నడ బిగ్‌బాస్‌ రియాల్టీషోలో ఉండగానే.. వర్తుర్‌ సంతోష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేసింది. బిగ్‌బాస్‌షోలో పులిగోరు ధరించి పాల్గొనడంతో సంతోష్‌పై పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. తొలుత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఫారెస్ట్‌ శాఖ ఆ తరువాత.. వర్తుర్ సంతోష్ ను అరెస్ట్‌ చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌ లోకి వెళ్లి మరీ సతీష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేయడం సంచలనం రేపింది. తొలుత సతీష్‌ ధరించిన పులిగోరును స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు వర్తుర్‌ సంతోష్‌పై కేసు నమోదుకాగా.. బిగ్‌బాస్‌ నిర్వాహకులు సతీష్‌ను అప్పగించడానికి తొలుత నిరాకరించారు. ఆ తర్వాత అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో.. అరెస్ట్ చేసేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ చరిత్రలో ఓ కంటెస్టెంట్ అరెస్ట్ అవ్వడం.. ఇదే తొలిసారి.. వర్తూరు సంతోష్‌ ప్రస్తుతం రామోహళ్లి ఫారెస్ట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. హోసూర్‌లో పులిగోరును కొన్నట్టు అటవీశాఖ అధికారులకు సంతోష్‌ వెల్లడించాడు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతని పై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

టీవీలో పులి పంజా లాకెట్‌ను ధరించిన దృశ్యాన్ని గమనించి.. చాలా మంది ఫిర్యాదులు చేయగా చర్యలు తీసుకున్నారు. కగ్గలిపూర్ అటవీ శాఖ కార్యాలయంలో సంతోష్‌ను విచారిస్తున్నారు. బెంగుళూరు ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవీంద్ర మాట్లాడుతూ.. విచారణ అనంతరం అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని తెలిపారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయను మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. సంతోష్‌ ఆల్ ఇండియా హాలిక్కర్‌ బ్రీడ్‌ కన్సర్వేషన్‌ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. హాలిక్కర్‌ ఓడెయ్యాగా ఆయనకు నిక్‌ నేమ్ ఉంది. హాలిక్కర్‌ బ్రీడ్‌ పశువుల సంరక్షణకు ఆయన పాటు పడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..