Kangana Ranaut: ‘తలైవి’ తెచ్చిన తిప్పలు.. కంగనాకు రెండు నెలలే టైమ్..!

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవిలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్‌కు వచ్చేసింది.

Kangana Ranaut: 'తలైవి' తెచ్చిన తిప్పలు.. కంగనాకు రెండు నెలలే టైమ్..!
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 2:06 PM

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవిలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్‌కు వచ్చేసింది. అయితే ఈ మూవీకి ఒప్పుకున్న తరువాత కంగనా చాలా కసరత్తులే చేశారు. ముఖ్యంగా అమ్మ పాత్రలో నటించడం కోసం కంగనా బరువు కూడా పెరిగారు. అంతకుముందు కాస్త సన్నగా ఉండే కంగనా.. ఈ మూవీ కోసం అధికంగా ఆహారం తీసుకోవడంతో పాటు హార్మోనీ పిల్స్ కూడా వాడి ఏకంగా 20కేజీల బరువును పెంచుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ క్లైమాక్స్‌కు వచ్చేయగా.. ఇప్పుడు బరువు తగ్గే పనిలో పడ్డారు కంగనా.

తేజస్, ధాఖడ్ అనే చిత్రాలను ఇప్పటికే కంగనా ఒప్పుకోగా.. అవి సెట్స్ మీదకు వెళ్లేందుకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించేసింది కంగనా. ఈ క్రమంలో యోగేష్ అనే ఓ ట్రైనర్‌ పర్యవేక్షణలో బరువు తగ్గే పనిలో పడింది ఈ బాలీవుడ్ భామ. మరోవైపు కంగనా బరువు తగ్గే విషయం గురించి ఆమె సోదరి రంగోలి చాందల్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘‘తలైవి షూటింగ్‌ ఫైనల్‌కు వచ్చింది. కంగనా 20 కేజీలు అదనపు బరువు పెరిగింది. మరో రెండు నెలల తరువాత ఆమె తేజస్, ధాకడ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనాలి. చూద్దాం ఈ రెండు నెలల్లో కంగనా తన అదనపు బరువును తగ్గించుకుంటుందో లేదో’’ అని కామెంట్ పెట్టారు. కాగా తలైవి ఈ ఏడాది జూన్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రాబోతున్న ఈ మూవీపై కంగనా భారీ అంచనాలే పెట్టుకున్నారు.

Read This Story Also: ‘లూసిఫర్’ రీమేక్.. చిరు మనసులో ఆ యంగ్ డైరక్టర్..!

https://twitter.com/Rangoli_A/status/1235215034755805185?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1235215034755805185&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fbollywood%2Fentertainment-news-kangana-ranaut-gained-20-kgs-for-thalaivi-says-sister-rangoli-chandel-2267820.html

Latest Articles
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక