Kangana Ranaut: భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీకి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈమె జీవితంలోని కొన్ని సంఘటన ఆధారంగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఇందిర పాత్రను ఎవరు చేస్తున్నారో తెలుసా? నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ప్రస్తుతం ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ బయోపిక్ తెరపైకి వచ్చింది.
అయితే దీనిపై స్పందించిన కంగనా అవును ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నామని, స్క్రిప్ట్ తుది దశలో ఉందని చెప్పింది. కానీ ఇందిరాగాంధీ బయోపిక్ కాదని ఇదొక పిరియాడిక్ ఫిల్మ్‌ని, కేవలం పొలిటికల్ డ్రామాగా మాత్రమే తెరకెక్కనుందని తెలిపింది. ఈ చిత్రం ద్వారా భారతీయ రాజకీయ స్వరూపాన్ని నేటి తరానికి చూపించబోతున్నామని వివరించింది. భారత రాజకీయాల్లో ఇందిరా గాంధీ ఒక ప్రాముఖ్యత గల నాయకురాలని చెప్పిన కంగన తాజా చిత్రంలో పలువురు ప్రముఖ నటుటు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఎవరెవరు? ఏయే పాత్రలు పోషిస్తారో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందేనని ప్రకటించింది. మరి ఇందిర పాత్రలో హాట్ బ్యూటీ ఏ విధంగా నటిస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.