‘కళంక్‌’ సాంగ్..ఆలియా డ్యాన్స్‌ అదుర్స్

|

Mar 18, 2019 | 4:06 PM

ముంబయి: బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్థాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కళంక్‌’. ఈ మూవీలో మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌, ఆలియా భట్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌లో నటించారు. అభిషేక్‌ వర్మన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా..ఇప్పటికే ఫస్ట్ లుక్స్‌తో, టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీలోని ‘ఘర్‌ మోరే పర్‌దేశియా..’ అనే తొలి పాట వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పాటలో యువరాణి అయిన ఆలియా.. మాధురీ దీక్షిత్‌ పాటకు చేసిన డ్యాన్స్‌ […]

‘కళంక్‌’ సాంగ్..ఆలియా డ్యాన్స్‌ అదుర్స్
Follow us on

ముంబయి: బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్థాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కళంక్‌’. ఈ మూవీలో మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌, ఆలియా భట్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌లో నటించారు. అభిషేక్‌ వర్మన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా..ఇప్పటికే ఫస్ట్ లుక్స్‌తో, టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీలోని ‘ఘర్‌ మోరే పర్‌దేశియా..’ అనే తొలి పాట వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పాటలో యువరాణి అయిన ఆలియా.. మాధురీ దీక్షిత్‌ పాటకు చేసిన డ్యాన్స్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఆలియా రూప్‌ అనే యువరాణి పాత్రలో నటించారు. భారత్‌కు స్వాతంత్రం రాకముందు ఓ యువరాణికి, ఓ వ్యక్తి మధ్య చిగురించిన ప్రేమకథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్‌లో 17న మూవీని రిలీజ్ చేయనున్నారు.