కరోనా వైరస్: కాజల్ ఎమోషనల్ పోస్ట్.. మేము సైతం అంటోన్న నెటిజన్లు..!

ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తోంది. ఈ మాయా జబ్బు ఎప్పుడు, ఎలా, ఎవరికి వస్తుందో తెలియక అందరిలో భయం పుట్టుకుంది. దీని ఆట కట్టించేందుకు శాస్త్రవేత్తలు నడుం బిగించారు.

కరోనా వైరస్: కాజల్ ఎమోషనల్ పోస్ట్.. మేము సైతం అంటోన్న నెటిజన్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 18, 2020 | 8:17 AM

ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తోంది. ఈ మాయా జబ్బు ఎప్పుడు, ఎలా, ఎవరికి వస్తుందో తెలియక అందరిలో భయం పుట్టుకుంది. దీని ఆట కట్టించేందుకు శాస్త్రవేత్తలు నడుం బిగించారు. కాగా ఈ వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆర్థికంగా అందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోజు వారీగా తమకు వచ్చే డబ్బులతో ఇంటిని నెట్టుకొస్తోన్న ఎంతోమందికి(క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు) ఇప్పుడు పని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వారు తమ గోడును ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే వారిపై కరోనా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఓ నిజ జీవిత సంఘటనను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది చందమామ కాజల్.

‘‘ఓ క్యాబ్ డ్రైవర్ నా ముందు నిల్చుని కన్నీరు పెట్టుకున్నారు. 48 గంటల్లో ఆయనకు నేనే మొదటి కస్టమర్‌నట. ఈ రోజైనా నిత్యావసర సరకులు వస్తాయని ఇంటి దగ్గర అతడి భార్య ఎదురుచూస్తోందట. ఈ వైరస్ చాలా విధాలుగా మనకు సోకచ్చు. కానీ రోజు వారీ జీవితం మీద ఆధారపడిన వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. తన చివరి కస్టమర్‌ను వదిలిన తరువాత ఆ డ్రైవర్ 70కి.మీలు తిరిగినట్లు నాకు చూపించాడు. దయచేసి క్యాబ్ డ్రైవర్లు, వీధుల్లో అమ్ముకునేవారికి కొంత డబ్బు ఎక్కువగానే ఇవ్వండి. ఆ రోజుకు మీరే వారి చివరి కస్టమర్ అవ్వొచ్చు’’ అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌ను షేర్ చేసిన కాజల్.. ఈ సంఘటన నా హృదయాన్ని కలిచివేసింది అంటూ పేర్కొన్నారు. కాగా కాజల్ చేసిన ఈ పోస్ట్‌కు పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. కచ్చితంగా మా వంతు సహాయం చేస్తాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: షాకింగ్: ఇరాన్‌లో 250మందికి పైగా భారతీయులకు కరోనా..!