Kajal Marriage: బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లాడబోతున్న కాజల్‌.. ఆసక్తికర వివరాలు!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి.

Kajal Marriage: బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లాడబోతున్న కాజల్‌.. ఆసక్తికర వివరాలు!

Edited By:

Updated on: Oct 05, 2020 | 5:13 PM

Kajal Aggarwal marriage: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ముంబయికి చెందిన గౌతమ్ కిచ్లు అనే ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్తను కాజల్‌ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల ఆమె నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. ఈ నెల లేదా వచ్చే నెలలో కాజల్‌, గౌతమ్‌ల వివాహం జరగబోతున్నట్లు టాక్‌. కాగా వ్యాపారవేత్తగా, ఇంటీరియర్‌ డిజైనర్‌గా గౌతమ్‌కి ముంబయిలో మంచి పేరు ఉంది. అయితే కాజల్ పెళ్లి విషయమై గతంలోనూ పలుమార్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తూ వచ్చారు. ఇక గౌతమ్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తుండగా.. వాటిపై ఆమె స్పందించకపోవడంతో ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.

కాగా లక్ష్మీ కళ్యాణంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పటివరకు తెలుగు, తమిళ్‌, హిందీలో దాదాపుగా 60 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాం ముంబయి సగ, దుల్కర్ సల్మాన్‌ హే సినామిక చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు.

Read More:

అన్‌లాక్‌ 5: ఏపీలో మార్గదర్శకాలివే

ఆన్‌లైన్ క్లాస్‌లు.. పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ కేసులు