అన్‌లాక్‌ 5: ఏపీలో ప్రభుత్వం పలు నిబంధనలు, సూచనలు.. మార్గదర్శకాలివే

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అన్‌లాక్‌ 5 గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది

అన్‌లాక్‌ 5: ఏపీలో ప్రభుత్వం పలు నిబంధనలు, సూచనలు.. మార్గదర్శకాలివే
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2020 | 3:09 PM

Unlock 5 guidelines: కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అన్‌లాక్‌ 5 గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, క్రీడాకారులకు మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్స్‌కి అనుమతిని ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను స్కూల్‌లోకి అనుమతించాలని వెల్లడించింది. కుదిరితే ఆన్‌లైన్‌ క్లాస్‌లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. అలాగే అక్టోబరు 31 తేదీ వరకూ లాక్‌డౌన్ నిబంధనలు కేవలం కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అన్‌లాక్‌ 5 మార్గదర్శకాలివే:

1.కంటైన్మెంటు జోన్లు మినహా మిగతా అన్ని చోట్ల అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి.

2.పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ సూచించిన వివిధ ప్రమాణాలను పాటించాలి.

3.పరిశోధక విద్యార్ధులు , పట్టభద్రులు కళాశాలల్లో సైన్స్ ల్యాబరేటరీలకు హాజరయ్యేందుకు అక్టోబరు 15 నుంచి అనుమతి.

4.కంటైన్మెంట్ జోన్ల వెలుపల వాణిజ్య ప్రదర్శనలను అనుమతి.

5.సామాజిక, విద్య, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ పరమైన సమావేశాలకు వంద మందికి మాత్రమే అనుమతి.

6.65 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు అత్యవసరం అయితే మినహా బయట తిరగకూడదు.

7.బహిరంగ ప్రదేశాలు, పనిచేస్తున్న కార్యాలయాలు, ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మాస్కులు తప్పని సరి

8.వాణిజ్య సముదాయాలు, దుకాణాల వద్ద కచ్చితంగా బౌతిక దూరం పాటించేలా చూడాలి.

9.బహిరంగంగంగా ఉమ్మి వేయటంపై నిషేధం. అలా చేస్తే జరిమానా విధించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ.

10. వీలైనంత మేర వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించాల్సించాలి.

ఇక ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే పాండమిక్ డిసీజెస్ యాక్టు, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read More:

ఆన్‌లైన్ క్లాస్‌లు.. పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ కేసులు

Bigg Boss 4: అభిజిత్‌-అఖిల్ మధ్య బిగ్‌ ఫైట్‌.. ఏడ్చేసిన మోనాల్‌

Latest Articles