Guava in Summer: సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!

వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే త్వరగా జబ్బుల బారిన పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎండా కాలంలో వడదెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సమ్మర్‌‌లో ఎక్కువగా లభ్యమయ్యే పండ్లలో జామ పండు కూడా ఒకటి. జామ పండు అన్ని సీజన్లలోనూ విరివిగా లభిస్తుంది. ఇందులో అనేక రకాలైన విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. పొట్ట ఆరోగ్యానికి కూడా జామ..

Guava in Summer: సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
Guava in Summer
Follow us

|

Updated on: Apr 30, 2024 | 2:22 PM

వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే త్వరగా జబ్బుల బారిన పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎండా కాలంలో వడదెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సమ్మర్‌‌లో ఎక్కువగా లభ్యమయ్యే పండ్లలో జామ పండు కూడా ఒకటి. జామ పండు అన్ని సీజన్లలోనూ విరివిగా లభిస్తుంది. ఇందులో అనేక రకాలైన విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. పొట్ట ఆరోగ్యానికి కూడా జామ పండు చాలా మంచిది. జామ పండులో విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వేసవి కాలంలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో జామ పండు తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇమ్యూనిటీని పెంచుతుంది:

జామకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కాబట్టి జామ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బల పడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు, రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. శరీరంలోకి హానికరమైన బ్యాక్టీరియాలుప్రవేశించకుండా చేస్తుంది.

తక్షణమే ఎనర్జీ:

జామ కాయ తినడం వల్ల శరీరంలో తక్షణమే ఎనర్జీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి అలసట, నీరసం వంటివి దరి చేరకుండా ఉంటాయి. వేసవి కాలంలో జామకాయలు తినడం బెస్ట్.

ఇవి కూడా చదవండి

చర్మానికి మేలు:

వేసవిలో జామ కాయ తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జామ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి రక్షణగా నిలుస్తాయి. ఎండ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు ఏర్పడకుండా చేస్తాయి.

జీర్ణక్రియ మెరుగు పడుతుంది:

జామకాయలో ఫైబర్ కంటెంట్ అనేది మెండుగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడానికి చక్కగా సహాయ పడుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. జామ పండు తింటే మల బద్ధకం సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. జామ కాయ తినడం వల్ల డయేరియా అనేది రాకుండా ఉంటుంది.

పీరియడ్స్‌లో బెస్ట్:

జామ కాయలోనే కాదు జామ ఆకులో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా మందికి పీరియడ్స్ సమయంలో నొప్పి, చిరాకు, తిమ్మిర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో జామ ఆకులు కానీ, జామ కాయలు తింటే.. ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. యూరినరీ సమస్యలను తగ్గించడంలో కూడా జామ కాయలు చక్కగా పని చేస్తాయి.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..