Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్ లాయర్ ఆ ?.. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టరా..?

ఉదాహరణకు తెలుగులో సాయి పల్లవి, శ్రీలీల వంటి హీరోయిన్స్ ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు హీరోయిన్లుగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా అటు లాయర్ గా ఉన్నత చదువులు చదువుతూ ఇటు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా ?..

Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్ లాయర్ ఆ ?.. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టరా..?
Malavika
Follow us

|

Updated on: Apr 30, 2024 | 1:25 PM

సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ వేరే ఫీల్డ్స్‏లో చదువుకుని అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారే. కొందరు డాక్టర్.. మరికొందరు లాయర్.. ఇంకొందరూ ఇంజనీరింగ్ చదువుతూనే ఫ్యాషన్ పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వస్తారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తాము కోరుకున్న కలలవైపు అడుగులు వేస్తుంటారు. ఉదాహరణకు తెలుగులో సాయి పల్లవి, శ్రీలీల వంటి హీరోయిన్స్ ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు హీరోయిన్లుగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా అటు లాయర్ గా ఉన్నత చదువులు చదువుతూ ఇటు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా ?.. తనే మాళవిక శర్మ.

మాళవిక శర్మ.. ముంబైకి చెందిన ఈ బ్యూటీ బ్యాచిలర్స్ లా చదువుతున్న సమయంలోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుగా కొన్ని యాడ్స్ చేసింది. ముంబైలోని రిజ్వి లా కాలేజీలో చదివినా మాళవిక.. క్రిమినాలజీ స్పెషలైజేషన్ బ్రాంచ్ లో లా చేసింది. లా చేస్తున్న సమయంలోనే మాస్ మాహరాజా రవితేజ సరసన నేల టికెట్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇక ఈసినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత రెడ్, కాఫీ విత్ కాదల్ సినిమాల్లో మెరిసింది. అయితే ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే గోపిచంద్ సరసన భీమా సినిమాలో కనిపించింది. ప్రస్తుతం సుధీర్ బాబు సరసన హరోంహర సినిమాలో నటిస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు లాయర్ గా ఉన్నత చదువులు చదువుతుంది. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో అడ్వకేట్..ఎల్ఎల్ఎం స్టూడెంట్ అంటూ క్యాప్షన్ ఇస్తూ లాయర్ గా దిగిన ఫోటో పెట్టింది. దీంతో మాళవిక లాయర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ ఇవే..
వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ ఇవే..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?