ఓటేసేందుకు లగ్జరీ స్పోర్ట్స్ కారులో వచ్చిన శిల్పా.. ధర ఏకంగా అన్ని కోట్లా?

TV9 Telugu

20 May 2024

సోమవారం (మే 20)దేశవ్యాప్తంగా ఐదో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగింది. . మహారాష్ట్ర, యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.

ఇక మహారాష్ట్రలో బాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్యులతో కలిసి క్యూలో నిల్చొని ఓటు వేశారు.

ఇందులో బాలీవుడ్ అందాల తార శిల్పాశెట్టి కూడా ఉంది.ఆమె తన తల్లి సునంద, సోదరి షమితతో కలిసి ఓటు వేయడానికి వచ్చారు.

అయితే పోలింగ్ కేంద్రంలో శిల్పాశెట్టి, షమితా శెట్టిలక  కంటే ఆమె వేసుకొచ్చిన కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పోలింగ్ కేంద్రానికి ఖరీదైన  రేంజ్ రోవర్ స్పోర్ట్‌ కారులో వచ్చింది శిల్పాశెట్టి. ఇటీవల ఈ కారను కొనుగోలు చేసిందట ఈ అందాల తార.

ల్పా తీసుకొచ్చిన లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దీని ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా శిల్పా శెట్టి చివరిగా రోహిత్ శెట్టి తొలి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో కనిపించింది. ఇందులో పలువురు స్టార్ హీరోలు కూడా నటించారు.

అయితే ఇటీవల శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సమస్యల్లో చిక్కుకున్నారు. ఓ కేసుకు సంబంధించి ఈడీ వీరి ఇంటిని జప్తు చేసింది.