21 May 2024

టాలీవుడ్ హీరోలపై కాజల్‌ అభిప్రాయం ఇదే.. 

Narender.Vaitla

ఇంటర్వ్యూలో భాగంగా కాజల్‌ మాట్లాడుతూ.. తాను చేసిన చిత్రాల్లో సత్యభామ అంటే ఇష్టమని. నటీనటులు ఎవరైనా ప్రస్తుతం వాళ్లు చేస్తోన్న సినిమాను అమితంగా ఇష్టపడాలని చెప్పుకొచ్చింది.

ఇక కాజల్‌తో పాటు తన కుమారుడు ఒకేరోజు పుట్టడంపై స్పందించిన కాజల్‌.. తామిద్దరం 19 తేదీన పుట్టామని, తాను జూన్‌ 19, అబ్బాయి ఏప్రిల్‌ 19. అది యాదృచ్ఛికంగా జరిగిందంతే. ప్లాన్‌ చేసుకోలేదని చెప్పుకొచ్చింది. 

ఇక తనకు కామెడీ, రొమాన్స్‌ జానర్‌ సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపిన కాజల్‌.. ‘బాద్‌ షా’లో తన పాత్ర చాలా ఇష్టమని అంది.

తన ఇష్టాల గురించి చెబుతూ.. చీర కట్టుకోవడం, మామిడి పండ్లు అంటే చాలా ఇష్టమని తెలిపిన కాజల్‌.. ఒక్కోరోజు మూడు పండ్లు కూడా తినేస్తున్నాని అంది. 

సోషల్‌ మీడియా ఎక్కువ వాడతారన్న ప్రశ్నకు బదులిస్తూ.. చాలా తక్కువ వాడతానని. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటేనే పోస్ట్‌ చేస్తాని చెప్పుకొచ్చింది.

ఇక తనకు ప్రయాణం చేయడమంటే అస్సలు నచ్చదని అందుకోసం సమయం వృథా చేసుకోనని తెలిపింది. అందుకే విమానంలోనే ప్రయాణించడానికే ప్రాధాన్యమిస్తానంది

హీరోలపై తన అభిప్రాయాన్ని చెబుతూ.. ప్రభాస్‌ సినిమాలను ఎంపిక చేసుకునే విధానం చాలా బాగుంటుంది. పాన్‌ ఇండియా, గ్లోబల్‌ స్క్రిప్ట్‌లను ఎంచుకుంటాడని తెలిపింది. అలాగే ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్‌, రామ్‌ చరణ్‌- ఆల్‌ రౌండర్‌,మహేశ్‌బాబు- చార్మింగ్‌ పర్సన్‌ అని తెలిపింది.

అలాగే అల్లు అర్జున్‌ ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటిస్తాడని తెలిపింది. అలాగే పవన్‌ కల్యాణ్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, చిరంజీవి కంప్లీట్‌ ప్యాకేజ్‌ అంటూ, బాలకృష్ణ చాలా ఫన్నీగా ఉంటారని చెప్పుకొచ్చింది.