చీర కట్టినా కామెంట్స్ చేస్తారు:అనికా సురేంద్రన్

TV9 Telugu

20 May 2024

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టింది  అనికా సురేంద్రన్.. 'విశ్వాసం'లో హీరో అజిత్ కుమార్ కూతురిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తెలుగులో 'బుట్టబొమ్మ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళ, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.

 కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అనిఖా సురేంద్రన్. ఎప్పటికప్పుడు తన విషయాలను అందులో పంచుకుంటుంది

ఇక తన లేటెస్ట్ గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుందీ అందాల తార. వీటికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

అదే సమయంలో చాలామంది హీరోయిన్లు, నటీనటుల్లాగే సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ ను ఫేస్ చేస్తోంది   అనిఖా సురేంద్రన్

ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో ఈ అందాల తారపై కొందరు నెటిజన్లు అదే పనిగా అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా వీటిపై స్పందించిన అనిఖా సురేంద్రన్.. నన్ను కామెంట్ చేయాలనే ఉద్దేశం ఉన్నోడు..  చీర కట్టినా సరే చేస్తాడని వాపోయింది.

ను కూడా మనిషినే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తట్టుకోలేను. దయచేసి కామెంట్స్ చూసుకుని పెట్టండంటూ నెటిజన్లను అభ్యర్థించింది అనిఖా.