చిత్ర సీమలో మరో విషాదం.. ఖైదీ నటుడు అరుణ్ అలెగ్జాండర్ హఠాన్మరణం..సంతాపం తెలిపిన ప్రముఖులు..

|

Dec 29, 2020 | 8:03 AM

2020 సంవత్సరం సినీ ఇండస్రీలో వరుస విషాదాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి వలన ప్రముఖ నటీనటులు, కొరియోగ్రాఫర్స్, దర్శకులు కన్నుముశారు.

చిత్ర సీమలో మరో విషాదం.. ఖైదీ నటుడు అరుణ్ అలెగ్జాండర్ హఠాన్మరణం..సంతాపం తెలిపిన ప్రముఖులు..
Follow us on

2020 సంవత్సరం సినీ ఇండస్రీలో వరుస విషాదాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి వలన ప్రముఖ నటీనటులు, కొరియోగ్రాఫర్స్, దర్శకులు కన్నుముశారు. ఈ మహమ్మరి వలన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కన్నుముశారు. కాగా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ చిత్రపరిశ్రమలో కూడా ప్రముఖ నటులు కన్నుముశారు. తాజాగా మరో తమిళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ హఠాన్మరణం చెందారు.

ఖైదీ సినిమాలో డ్రగ్స్ ముఠారు సహకరించే పోలీస్ అధికారిగా నటించిన అరుణ్ అలెగ్జాండర్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా కూడా పనిచేశారు. మనరం, కోలమావు కోకిలా, ఖైదీ, బిగిల్ సినిమాల్లో నటించాడు. తాజాగా విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమాలోనూ ఆయన నటించారు. కేవలం 48 ఏళ్ళ వయసులోనే అరుణ్ మృతిచెందడంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.