Yesudas hospitalised: ఆస్పత్రిలో చేరిన KJ యేసుదాసు..? స్పందించిన కుమారుడు
ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాస్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఆయన కుమారుడు విజయ్ యేసుదాస్ ఖండించారు. చెన్నై ఆసుపత్రిలో చేరారనే వార్తల్లో నిజం లేదని, ఆయన అమెరికాలో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇటీవల 85వ పుట్టినరోజు జరుపుకున్న యేసుదాస్ ఆరు దశాబ్దాలకు పైగా సంగీత సేవలను అందించారు. ఆయన ఆరోగ్యం గురించి వచ్చిన అవాస్తవ వార్తలతో అభిమానులు ఆందోళన చెందారు.

ప్రఖ్యాత సినీ గాయకుడు కె.జె. యేసుదాస్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. దీంతో ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ఆయన కుమారుడు, గాయకుడు విజయ్ యేసుదాస్ స్పందించారు. నాన్నగారు ఆసుపత్రిలో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. యేసుదాస్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. ఇటీవలె జనవరి 10న యేసుదాస్ 85 ఏళ్లు పడిలోకి అడుగుపెట్టారు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లవెత్తాయి. ఆరు దశాబ్దాలకు పైగా 50,000 పాటలకు పైగా పాడారు యేసుదాసు. ఆయన స్వరానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
గాన గంధర్వన్ (ది సెలెస్టియల్ సింగర్)గా ప్రసిద్ధి చెందిన యేసుదాస్ మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, తెలుగు, అరబిక్, రష్యన్ అనేక ఇతర భాషలలో పాటలు పాడారు. కె.జె. యేసుదాస్ ఎనిమిది జాతీయ అవార్డులు, కేరళ, తమిళం, నాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ నుండి రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆయనకు 1975 లో పద్మశ్రీ, 2002 లో పద్మభూషణ్ మరియు 2017 లో పద్మవిభూషణ్ అవార్డులు కూడా లభించాయి. అయితే.. యేసుదాస్ వయస్సు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారని, దీని కారణంగా ఆసుపత్రిలో చేరారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు విజయ్ యేసుదాసు క్లారిటీ ఇవ్వడంతో ఇండస్ట్రీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. తమ అభిమాన గాయకుడికి ఏమైందనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అయింది.




