John Abraham: అభిమానిని ఆట పట్టించిన జాన్‌ అబ్రహం.. ఫొటోలు తీస్తుండగా ఫోన్‌ లాక్కెళ్లి పోయిన యాక్షన్‌ హీరో..

|

Nov 20, 2021 | 10:47 AM

బాలీవుడ్‌ కండల వీరుడు జాన్‌ అబ్రహంకు ఎంతటి ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సినిమాల్లో..

John Abraham: అభిమానిని ఆట పట్టించిన జాన్‌ అబ్రహం.. ఫొటోలు తీస్తుండగా ఫోన్‌ లాక్కెళ్లి పోయిన యాక్షన్‌ హీరో..
Follow us on

బాలీవుడ్‌ కండల వీరుడు జాన్‌ అబ్రహంకు ఎంతటి ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సినిమాల్లో అతను చేసే యాక్షన్ సీక్వెన్స్‌లకు ఎంతోమంది అభిమానులున్నారు. చాలామంది అతనిని కలవాలని, కనీసం ఒక్క ఫోటో అయినా దిగాలని ఆరాటపడుతుంటారు. మరి అలాంటి హీరో రోడ్డుమీదికొస్తే ఫ్యాన్స్‌ ఊరుకుంటారా.. సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఉదయం జాగింగ్‌కు వెళ్లిన అతను రోడ్డుమీద నడుచుకుని వెళ్తుండగా ఇద్దరు అభిమానులు బైక్‌పై కూర్చొని తీరిగ్గా సెల్ఫీ వీడియో తీశారు . అంతలోనే జాన్‌ అబ్రహం వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ల చేతుల్లోంచి మొబైల్‌ లాక్కున్నాడు. అనంతరం ఫోన్‌ కెమెరా వైపు చూస్తూ.. హాయ్ బాయ్స్‌.. ఇప్పుడు ఒకేనా..? అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడాడు. ఆ తర్వాత యువకులు బైక్‌ స్టార్ట్‌ చేసి అబ్రహంను అనుసరిస్తూ తమ మొబైల్‌ను తీసుకుంటారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్‌ హీరో అయినా అతను చాలా సరదాగా మాట్లాడాడని.. ఎక్కడా గర్వం చూపించలేదని నెటిజన్లు హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఏప్రిల్‌లో ‘ముంబై సాగా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జాన్‌. అతని తాజా చిత్రం ‘సత్యమేవ జయతే2’ ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది. దివ్యాఖోస్లా కుమార్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నోరా ఫతేహి ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరవనుంది. మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే సినీ ప్రియులను అలరిస్తోంది.

Also Read:

Nikhil Siddhartha : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు పెంచిన కుర్ర హీరో.. నిఖిల్ దూకుడు మాములుగా లేదుగా..

Nandamuri Balakrishna: అఖండ తర్వాత అమెరికాకు బాలయ్య.. గోపీచంద్ సినిమా అక్కడే..

Thalapathy vijay : వంశీ పైడిపల్లి సినిమాలో దళపతి విజయ్ అలా కనిపించనున్నారట..