Thalaivi Movie: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కంగనా జయలలిత పాత్రను పోషిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మతగా వ్యవహరించారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిన ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సినిమా చిత్రీకరణ పూర్తయినప్పటికీ థియేటర్లు మూతపడడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులు మెరుగుపడడం, థియేటర్లు తిరిగి ప్రారంభమవుతుండడంతో తలైవి మూవీ మేకర్స్ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ వేగాన్ని పెంచే పనిలో పడింది చిత్ర యూనిట్ ఇందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్ ఎమ్‌జీఆర్, జయలలిత మధ్య (కంగనా, అరవిందస్వామి) తెరకెక్కించిన ఓ లవ్ సాంగ్‌ను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ వీడియోను కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ పాట సినిమా షూటింగ్ నేపథ్యంలో వచ్చేలా అర్థమవుతోంది. పూర్తి పాటను సోమవారం విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అరవింద స్వామి ఎమ్‌జీఆర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాను తొలుత ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని తర్వాత తెలిసింది.
Bank Holiday: బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక..! ఈ రోజు నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులకు సెలవు..
Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! ఇక నుంచి ఏసీ కోచ్‌లో ప్రయాణం చాలా చౌక..