Kangana: అరెరే.. కంగనా పలకరించినా పట్టించుకోకుండా వెళ్లి పోయిందే. వైరల్‌ అవుతోన్న జయా బచ్చన్‌ వ్యవహారశైలి..

|

Nov 10, 2022 | 6:32 PM

వ్యక్తుల మధ్య ఉన్న మనస్పార్థాలు కొన్ని సందర్భాల్లో బహిరంగ వేదికగా ప్రపంచానికి తెలుస్తుంటాయి. సామాన్యుల విషయాన్ని పక్కన పెడితే సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారలు ఇట్టే వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే నెట్టింట చక్కర్లు కొడుతోంది...

Kangana: అరెరే.. కంగనా పలకరించినా పట్టించుకోకుండా వెళ్లి పోయిందే. వైరల్‌ అవుతోన్న జయా బచ్చన్‌ వ్యవహారశైలి..
Jaya Bachchan Kangana Video
Follow us on

వ్యక్తుల మధ్య ఉన్న మనస్పార్థాలు కొన్ని సందర్భాల్లో బహిరంగ వేదికగా ప్రపంచానికి తెలుస్తుంటాయి. సామాన్యుల విషయాన్ని పక్కన పెడితే సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారలు ఇట్టే వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే నెట్టింట చక్కర్లు కొడుతోంది. జయబాచ్చన్‌, కంగన రనౌత్‌ల మధ్య ఉన్న మనస్పార్థాలకు తాజాగా ఓ ఈవెంట్‌ వేదికైంది. అమితాబ్‌, అనుపమ్‌ ఖేర్‌, బోమన్‌ ఇరానీ వంటి సీనియర్‌ నటులు నటించిన ‘ఉంచై’ సినిమా నవంబర్‌ 11 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గురువారం ప్రీమియర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఈవెంట్‌కు జయా బచ్చన్‌తో పాటు, కంగన రనౌత్‌ కూడా హాజరయ్యారు. ఈ సమయంలోనే జయ బచ్చాన్‌ను చూసిన కంగనా.. ‘హలో జయా జీ’ అని పలకరించారు. అయితే ఆమె మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం ఒక స్మైల్‌ కూడా ఇవ్వకుండా కంగనాను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. అయితే కంగనా పక్కన ఉన్న వారిని మాత్రం నవ్వుతు పలకరించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. జయా బచ్చన్‌ తనను కావాలనే అవైడ్‌ చేశారన్న విషయం కంగనాకు చాలా స్పష్టంగా అర్థమైనట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. అయితే ఈవెంట్‌కు హాజరైన అభిషేక్‌ బచ్చన్‌ మాత్రం కంగనాను ఆప్యాయంగా పలకరించారు. ఈ సంఘటనతో అసలు జయా బచ్చన్‌కు కంగనాకు మధ్య నెలకొన్ని వివాదం ఎంటన్న చర్చ తెరపైకి వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..