Pawan Kalyan – Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ

|

Jul 30, 2021 | 3:07 PM

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక లేఖ రాశారు. "ఇంతకాలం తెరవెనుక ఉండి ఎంతో మంది నటీనటుల్ని డైరెక్ట్ చేసిన మీరు....

Pawan Kalyan - Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ
Pawankalyan Letter To Ragha
Follow us on

K. Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక లేఖ రాశారు. “ఇంతకాలం తెరవెనుక ఉండి ఎంతో మంది నటీనటుల్ని డైరెక్ట్ చేసిన మీరు.. తెర ముందుకు వచ్చి నటుడిగా కనిపించడం చాలా సంతోషకరం” అని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు. “ఇకపై మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఎంతో మంది దిగ్గజ దర్శకులు సైతం ఎదురు చూడ్డం ఖాయం” అంటూ పవన్ ఆకాంక్షించారు.

ఇలా ఉండగా, సినీ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పెళ్లి సంద‌D’లో సినిమా రాఘవేంద్రరావు ఓ కీలక పాత్రలో నటిస్తోన్నారు. ఈ సినిమాలో రాఘవేంద్రరావు వశిష్ట అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగానే పవన్.. దర్శకేంద్రుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు.

కాగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలాకాలం తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టుకుంటున్నారు. గతంలో శ్రీకాంత్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘పెళ్ళిసందడి’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథ, కామెడీ, సంగీతం, ఎమోషన్స్ ఇలా అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇంత కాలానికి ఆ సినిమాకు సీక్వెల్ గా ‘పెళ్లి సంద‌D’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శ్రీలీల హీరోయిన్‌‌‌‌‌‌గా పరిచయం అవుతోంది.

ఈ సినిమాలో రాఘవేంద్రరావు.. హీరో రోషన్‌‌‌‌‌కు తాతగా నటిస్తోన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలో రాఘవేంద్రరావు సూటు- బూటు వేసుకొని స్టైలిష్‌‌‌‌‌గా కనిపించారు. ఈ ప్రోమోను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా ఇవాళ విడుదల చేశారు. వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన తర్వాత మన మౌనముని కెమెరా ముందుకు వచ్చారు అంటూ రాజమౌళి రాసుకొచ్చారు.

Read also :  Karimnagar: తొమ్మిది గంటల నాన్‌స్టాప్‌ రెస్క్యూ ఆపరేషన్.. ఎట్టకేలకు బయటకు బావిలోపడ్డ కారు.. వెలుగులోకి విస్తుపోయే విషయం