అవును.. ఆ హీరోయిన్‌తో నాకు అఫైర్ ఉండేది: జగపతి బాబు

| Edited By:

Apr 04, 2020 | 3:14 PM

అలనాటి నటి సౌందర్యతో తనకు అఫైర్‌ ఉండేదని విలక్షణ నటుడు జగపతి బాబు స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడుతూ.. ”అవును సౌందర్యతో నాకు అఫైర్ ఉండేది. ఆమె సోదరుడు నాకు చాలా క్లోజ్‌. అందుకే వారి ఇంటికి వెళ్లేవాడిని. సౌందర్య మా ఇంటికి తరచుగా వచ్చేది. ఆమె గురించి తప్పుగా అనుకునే వారు కానీ సౌందర్య అలాంటి కాదు. మా బంధాన్ని ప్రజలు ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకునే వారు” అని జగపతి […]

అవును.. ఆ హీరోయిన్‌తో నాకు అఫైర్ ఉండేది: జగపతి బాబు
Follow us on

అలనాటి నటి సౌందర్యతో తనకు అఫైర్‌ ఉండేదని విలక్షణ నటుడు జగపతి బాబు స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడుతూ.. ”అవును సౌందర్యతో నాకు అఫైర్ ఉండేది. ఆమె సోదరుడు నాకు చాలా క్లోజ్‌. అందుకే వారి ఇంటికి వెళ్లేవాడిని. సౌందర్య మా ఇంటికి తరచుగా వచ్చేది. ఆమె గురించి తప్పుగా అనుకునే వారు కానీ సౌందర్య అలాంటి కాదు. మా బంధాన్ని ప్రజలు ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకునే వారు” అని జగపతి బాబు అన్నారు.

అంతేకాకుండా.. ”మా బంధం గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని కాంప్లిమెంట్‌గానే తీసుకుంటా. ఆ విషయంలో నేను దాయాల్సింది ఏమీ లేదు. మాపై వచ్చే రూమర్లను నేను కాంప్లిమెంట్‌గా తీసుకుంటా. అందరి దృష్టిలో అఫైర్‌ అంటే లైంగిక సంబంధం కలిగి ఉండటమని ఆలోచిస్తారు. కానీ నేను, సౌందర్య మంచి అనుబంధాన్ని కలిగి ఉండేవాళ్లం. అదే ఆమెతో నాకున్న అఫైర్” అని ఆయన క్లారిటీ ఇచ్చారు. కాగా జగపతి బాబు, సౌందర్య ఇద్దరు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అంతేకాదు బయట కూడా చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఈ క్రమంలో వీరిద్దరి గురించి అప్పట్లో చాలా పుకార్లు నడిచాయి. ఇక తమ బంధం గురించి జగపతిబాబు కూడా పలుమార్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విల‌యం..పెరిగిపోతున్న కేసులు