విజయ్ సినిమాలో బాలీవుడ్ స్టార్..!

|

Mar 21, 2019 | 5:23 PM

దళపతి విజయ్ హీరోగా అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కోచ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం చెన్నై లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ నటుడు జాకీ షరీఫ్ ను తీసుకున్నారని తెలుస్తోంది. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ […]

విజయ్ సినిమాలో బాలీవుడ్ స్టార్..!
Follow us on

దళపతి విజయ్ హీరోగా అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కోచ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం చెన్నై లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ నటుడు జాకీ షరీఫ్ ను తీసుకున్నారని తెలుస్తోంది. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ‘తేరి’, ‘మెర్సల్’ సినిమాలతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న విజయ్, అట్లీ కుమార్ నుంచి వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుందట.