AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అతడే.. జబర్దస్త్ కమెడియన్ సంచలన కామెంట్స్..

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో మంది కమెడియన్లకు లైఫ్, కెరీర్ ఇచ్చిన ఈ షో.. ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ ప్రముఖ రియాల్టీ షోలో సందడి చేస్తున్నారు. ఇదివరకే ఎంతో మంది హౌస్ లోకి అడుగుపెట్టి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా నిలిచారు.

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అతడే.. జబర్దస్త్ కమెడియన్ సంచలన కామెంట్స్..
Kevvu Karthik
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2026 | 8:48 AM

Share

బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో కృష్ణుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి రోజుకో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ప్రముఖ కమెడియన్ కెవ్వు కార్తీక్ బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఆయన ఓ టాక్ షోలో పాల్గొని, చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో యాంకర్ మాట్లాడుతూ… “మీరు మరో హౌస్‌లోకి వెళ్లడానికే యూకే నుంచి ఇండియాకు వచ్చారని తెలుస్తోంది” అని వైల్డ్ కార్డ్ ఎంట్రీపై పరోక్షంగా ప్రశ్నించారు.. దానికి కార్తీక్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ “ఇవన్నీ నీకెలా తెలుసు” అని అనడంతో ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం ఖాయమేనని తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో తన ఫ్రెండ్స్ వర్షిణి, వంశీ, ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్ హౌస్‌లో ఉన్నారని, వారందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు కార్తీక్ చెప్పారు. నా ఉద్దేశంలో ఈసారి పొట్టి నరేష్ టాప్-5లో ఉంటాడని, కుదిరితే సీజన్ విన్నర్ కూడా అతనే అయ్యే అవకాశం ఉందని అన్నారు కార్తీక్. ఒకవేళ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌గా వెళ్తే పరిస్థితి ఏంటని యాంకర్ అడగ్గా, “ఒకవేళ నేనే హౌస్‌లోకి వెళ్తే మాత్రం నేనే గెలవాలని కోరుకుంటాను” అని సరదాగా అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

గతంలో బిగ్ బాస్‌కి వెళ్లిన జబర్దస్త్ కమెడియన్లలో ఎంతోమంది టాప్-5 వరకు, లేదా రన్నరప్‌లుగా మాత్రమే నిలిచారని కార్తీక్ గుర్తుచేశారు. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా ఒక జబర్దస్త్ కమెడియన్ బిగ్ బాస్ ట్రోఫీ సాధించి తీరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, ‘అగ్నిపరీక్ష’ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన కామనర్స్ ఆటతీరును కార్తీక్ ప్రశంసించారు. మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినప్పటికీ వారు అద్భుతంగా ఆడుతున్నారని, ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం యూకే నుంచి ప్రత్యేకంగా ఇండియా తిరిగి వచ్చిన కెవ్వు కార్తీక్ నిజంగానే బిగ్ బాస్ 10 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us