Israel-Hamas War: ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య కొనసాగుతోన్న భీకరపోరు.. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రముఖ నటి!

|

Oct 08, 2023 | 4:55 PM

హైఫా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు బాలీవుడ్‌ నటి నుష్రత్‌ ఇటీవల ఇజ్రాయెల్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ దేశంలో ఊహించని రీతిలో ఇజ్రాయెల్‌ పాలస్తీనా ఉగ్రవాడ సంస్థ హమాస్‌ మధ్య యుద్ధం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న నటి సహచరులు ఆమెకు ఫోన్‌ చేసి అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు. తానొక బేస్‌మెంట్‌లో సురక్షితంగానే ఉన్నానని ఆమె చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమెతో వాల్ల టీంకు కాంటాక్ట్‌ తెగిపోయింది. శనివారం (అక్టోబర్‌ 7) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల తర్వాత..

Israel-Hamas War: ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య కొనసాగుతోన్న భీకరపోరు.. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రముఖ నటి!
Actor Nushrratt Bharuccha
Follow us on

ఇజ్రాయెల్‌ సైన్యానికి-హమాస్‌ మిలిటెంట్ల మధ్య దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిదే. ఈ క్రమంలో హైఫా ఇంగర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్‌ వెళ్లిన బాలీవుడ్‌ నటి నుష్రత్‌ బరుచా అక్కడ చిక్కుకుపోయారు. టీమ్‌తో కాంటాక్ట్‌ పోగొట్టుకుని నానా ఇబ్బందులు పడింది. ఎట్టకేలకు వారితో తిరిగి కాంటాక్ట్‌లోకి వచ్చానని, భారత్‌కు పయనమైనట్లు వెల్లడించారు.

కాగా హైఫా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు బాలీవుడ్‌ నటి నుష్రత్‌ ఇటీవల ఇజ్రాయెల్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ దేశంలో ఊహించని రీతిలో ఇజ్రాయెల్‌ పాలస్తీనా ఉగ్రవాడ సంస్థ హమాస్‌ మధ్య యుద్ధం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న నటి సహచరులు ఆమెకు ఫోన్‌ చేసి అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు. తానొక బేస్‌మెంట్‌లో సురక్షితంగానే ఉన్నానని ఆమె చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమెతో వాల్ల టీంకు కాంటాక్ట్‌ తెగిపోయింది. శనివారం (అక్టోబర్‌ 7) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల తర్వాత ఆమె ఫోన్‌కు స్పందించకపోవడంతో వారంతా కంగారుపడ్డారు. ‘రాయబార కార్యాలయం సహాయంతో మేం ఆమెతో తిరిగి టచ్‌లోకి వచ్చాం. ఆమె సురక్షితంగా భారత్‌కు చేరుకోనుంది. ప్రస్తుతం డైరెక్ట్‌ ఫ్లైట్‌ దొరకలేదు. కనెక్టింగ్‌ ఫ్లైట్‌లో ఆమె స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నటి త్వరలో భారతదేశానికి చేరుకోవడానికి బయలుదేరనున్నారు. ఆమె భారత్‌కు చేరుకోగానే మరిన్ని విషయాలు తెలియజేస్తాం. ప్రస్తుతం ఆమె సురక్షితంగానే ఉన్నారంటూ’ అని ఆమె టీమ్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

అక్టోబరు 8 (శనివారం) గాజా స్ట్రిప్‌లోని మిలిటెంట్ గ్రూప్ హమాస్ – ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపు 600కుపైగా ప్రజలు మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌ దేశంపైకి 5 వేల కంటే ఎక్కువ రాకెట్లను ప్రయోగించింది. సరిహద్దు సమీపంలో అనేక మంది ఇజ్రాయెల్ సైనికులను హమాస్‌ ఉగ్రవాదులు అపహరించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిసింది. ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌లో యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌పై దాడి చేసినందుకు హమాస్ తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ ఆయన పేర్కొన్నారు. దీనిపై భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌పై ఉగ్ర దాడుల వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు మా సంఘీభావం తెల్పుతున్నామంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.