
ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే మరికొంతమంది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఇంకా పెళ్లి చేసుకోకుండా.. అసలు ఆ ఊసే లేకుండా గడిపేస్తున్నారు. అలాంటి వారిలో కంగనా రనౌత్ ఒకరు. ఈ అమ్మడు సినిమాలతో కంటే కాంట్రవర్సిలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది పై నెగిటివ్ కామెంట్స్ చేసింది కంగనా.. స్టార్ హీరోలను కూడా వదల్లేదు.. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి బడా హీరోల పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. అంతే కాదు రాజకీయ నాయకులను కూడా వదల్లేదు ఈ ఫైర్ బ్రాండ్. కంగనా కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కంగనా రనౌత్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో అటు బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కనుందని టాక్. కంగనా వయసు ప్రస్తుతం 36 ఏళ్ళు . ఈ సీనియర్ బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో యంగ్ బ్యూటీలు.. కియారా అద్వానీ, అలియా భట్ లాంటి బ్యూటీలు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు కంగనా కూడా పెళ్లి చేసుకుంటుందని వార్తలు కోరుగా ప్రచారం అవుతున్నాయి.
కంగనా ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటించింది. ఈ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. చంద్రముఖి సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ నటించగా.. కంగనా చంద్రముఖిగా కనిపించింది. 17 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు చంద్రముఖి 2 సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. అలాగే ఇందిరాగాంధీ బయోపిక్ లోనూ నటిస్తుంది కంగనా. ఈ సినిమాలో ఈ బ్యూటీ ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.