సీబీడీ ఆయిల్‌ని చట్టబద్ధం చేయండి: ఇర్ఫాన్ భార్య విఙ్ఞప్తి

| Edited By:

Sep 30, 2020 | 12:15 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో.. ఇప్పుడు ఆ చర్చ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సీబీడీ ఆయిల్‌ని చట్టబద్ధం చేయండి: ఇర్ఫాన్ భార్య విఙ్ఞప్తి
Follow us on

Irrfan wife Sutapa: బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో.. ఇప్పుడు ఆ చర్చ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కోణంపై దర్యాప్తు చేస్తోన్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇప్పటికే రియా సహా పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ కోణంలో దీపికా, శ్రద్ధా, రకుల్‌, సారాలను సైతం విచారించారు. ఇదిలా ఉంటే మరోవైపు వీరు సీబీడీ ఆయిల్‌ని వాడినట్లు ఆరోపణలు రాగా.. అసలు సీబీడీ ఆయిల్‌ వినియోగం న్యాయబద్ధమా..? కాదా..? అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ భార్య సుతాపా సికదర్ సంచలన విఙ్ఞప్తి చేశారు. సీబీడీ ఆయిల్‌ని భారత్‌లో చట్టబద్ధం చేయాలని ఆమె హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. క్యాన్సర్‌కి సంబంధించి లండన్‌లో ఇర్ఫాన్ ఖాన్ ట్రీట్‌మెంట్ తీసుకున్న ఫొటోను షేర్ చేసిన సుతాపా.. ఈ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకునే సమయంలో బయటి నుంచి అతడి రూమ్‌ని ఎలా చూసేదాన్నో ఇప్పుడు అలానే చూస్తున్నా అని కామెంట్‌ పెట్టారు. దానికి ఒంటరి నడక, నువ్వు ఇక్కడ ఉంటే బావుండు, క్యాన్సర్ బాధ, సీబీడీ ఆయిన్‌ని భారత్‌లో చట్టబద్ధం చేయాలి అన్న హ్యాష్‌ట్యాగ్‌లను ఇచ్చారు.

కాగా గంజాయి ఆకుల నుంచి సీబీడీ ఆయిల్‌ని తయారు చేస్తారు. దీన్ని కన్నాబిడియోల్ అని కూడా పిలుస్తారు. ఇందులో గంజాయి మోతాదు 40 శాతం వరకు ఉండగా.. పలు దేశాల్లో దీన్ని రోగులకు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఇక భారత్‌లో దీన్ని ఎక్కువగా వినియోగిస్తుండగా.. ఇప్పటికైతే దీనిపై ఎలాంటి నిషేధం లేదు. ఇక సుశాంత్ కేసు విషయంలో ఆన్ లైన్ ద్వారా నటి శ్రద్దాకు తానే సీబీడీ ఆయిల్‌ని ఆర్డర్ చేసినట్లు సుశాంత్ మాజీ మేనేజర్ జయాసాహా ఎన్సీబీ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే దీన్ని సుశాంత్ కి ఎలా ఇవ్వాలో రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా వివరంగా చెప్పినట్లు జయా సాహా చెప్పినట్లు సమాచారం.

Read More:

మీ పనితీరు బావుంది: ప్రకాశం జిల్లా అధికారులకు జగన్ ప్రశంస

వరద నీటిలో కొట్టుకుపోయిన శర్వానంద్ తాత, మాజీ అణు శాస్త్రవేత్త ఇల్లు