ఇద్దరు లెజండ్స్‌ కలిసి నటించిన ఏకైక చిత్రమిదే..!

| Edited By:

Apr 30, 2020 | 3:42 PM

24 గంటల్లో ఇద్దరు అసాధరణ నటులు అశేష సినీ ప్రేక్షకులను వదిలి దివికేగారు. ఇర్ఫాన్‌ ఖాన్, రిషి కపూర్‌ల ఆకస్మిక మరణం ఇప్పుడు యావత్ దేశాన్ని శోకంలో ముంచింది.

ఇద్దరు లెజండ్స్‌ కలిసి నటించిన ఏకైక చిత్రమిదే..!
Follow us on

24 గంటల్లో ఇద్దరు అసాధరణ నటులు అశేష సినీ ప్రేక్షకులను వదిలి దివికేగారు. ఇర్ఫాన్‌ ఖాన్, రిషి కపూర్‌ల ఆకస్మిక మరణం కేవలం బాలీవుడ్‌నే కాదు యావత్ దేశాన్ని శోకంలో ముంచింది. వారి మరణాన్ని చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు నటులు కలిసి ఒకే ఒక చిత్రంలో నటించారు. 2013లో నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన ‘డీ-డే’ చిత్రంలో వీరిద్దరు కనిపించారు. ఈ మూవీలో రిషి కపూర్ డాన్ గా.. ఇర్ఫాన్ ఖాన్ రా ఏజెంట్ గా కనిపించారు. దీంతో ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తోన్న నెటిజన్లు.. ఇద్దరు లెజండ్లను కోల్పోయాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ ఇద్దరు క్యాన్సర్‌ బారిన పడి దాదాపు రెండు సంవత్సరాల పాటు పోరాడి ఓడారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ నేపథ్యంలో దేశం గర్వించదగ్గ గొప్ప నటులను సాధారణంగా పంపించడం వారి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సన్నిహితులు, తోటి నటీనటులు కూడా వారి చివరి చూపును చూడలేకపోయారు. కాగా రిషి కపూర్ అంత్యక్రియల కోసం ఎవరూ రావొద్దంటూ ఆయన కుటుంబ సభ్యులు కోరిన విషయం తెలిసిందే.

Read This Story Also: మహేష్‌తో మూవీ‌.. అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్..!