విక్రమ్ ‘కోబ్రా’: ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్‌లుక్‌ విడుదల.. అదిరిపోయాడుగా

'డిమోంటి కాలనీ' ఫేమ్‌ అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ 'కోబ్రా' అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే

  • Tv9 Telugu
  • Publish Date - 11:54 am, Wed, 28 October 20
విక్రమ్ 'కోబ్రా': ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్‌లుక్‌ విడుదల.. అదిరిపోయాడుగా

Irfan Pathan look Cobra: ‘డిమోంటి కాలనీ’ ఫేమ్‌ అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ ద్వారా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మంగళవారం పఠాన్ పుట్టినరోజు సందర్భంగా కోబ్రా నుంచి ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. (మరోసారి లెక్చరర్‌గా వెంకటేష్‌.!)

ఇందులో అస్లన్‌ ఇల్మజ్‌ ఏ ఫ్రెంచ్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్ పాత్రలో ఇర్ఫాన్ నటిస్తుండగా.. ఫస్ట్‌లుక్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విక్రమ్‌ ఏడు పాత్రల్లో కనిపించనున్నారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. సర్‌జానో, కేఎస్‌ రవికుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియోస్‌, వియకామ్‌ 18 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. (ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు.. క్వింటా రూ.7వేలు)