RC 15 movie: రామ్ చ‌ర‌ణ్ – శంకర్‌ల సినిమా క‌థ అదేనా.? ఈ సినిమాలో చెర్రీ పాత్ర ఇదేనంటూ..

|

Oct 16, 2021 | 1:56 PM

RC 15 movie: మెగా ప‌వ‌ర‌స్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విష‌యం తెలిసిందే. వీరి కాంబినేష‌న్‌లో సినిమా రానుంద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే ఈ ప్రాజెక్ట్‌పై...

RC 15 movie: రామ్ చ‌ర‌ణ్ - శంకర్‌ల సినిమా క‌థ అదేనా.? ఈ సినిమాలో చెర్రీ పాత్ర ఇదేనంటూ..
Ramcharan Shanker Movie
Follow us on

RC 15 movie: మెగా ప‌వ‌ర‌స్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విష‌యం తెలిసిందే. వీరి కాంబినేష‌న్‌లో సినిమా రానుంద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే ఈ ప్రాజెక్ట్‌పై ఒక్క‌సారిగా అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ చూపు ఈ సినిమాపై ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఎన్నోఅంచ‌నాలు ఉన్న ఈ సినిమాను శంక‌ర్ అదే స్థాయిలో తెర‌కెక్కించ‌చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాను ఏకంగా రూ. 170 కోట్ల అత్యంత భారీ బ‌డ్జెట్‌కు తెర‌కెక్కించేందు సిద్ధ‌మ‌వుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందన‌నున్న ఈ సినిమాపై ఇప్పుడు అంద‌రి దృష్టి ప‌డింది.

ఇలా ఇన్ని అంచ‌నాల న‌డుమ తెర‌కెక్కుతోన్న ఈ సినిమా క‌థ ఏంట‌న్న‌దానిపై సహజంగానే ఊహాగానాలు ఉంటాయి. ఈ కార‌ణంగానే ఈ సినిమా క‌థ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ‌జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఓ వార్త ప్ర‌కారం ఈ సినిమా క‌థ ఇదేనంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. వ్య‌వ‌స్థ‌లో ఉండే త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూ సినిమాలు తీసే శంక‌ర్ ఈ సినిమాలోనూ అలాంటి పంథానే ఎంచుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

అస్త‌వ్య‌స్త‌మైన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఓ ఐఎస్ ఆఫీస‌ర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎలా బాగు చేశాడ‌న్నదే ఈ సినిమా క‌థ అంటూ భారీ ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ఈ వార్త‌లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ విడ‌దుల‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే శంక‌ర్ గ‌తంలో తెర‌కెక్కించిన ఒకే ఒక్క‌డు కూడా ఇలాంటి పొలిట‌క‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే.

Also Read: Mohan Babu: పదేపదే రెచ్చగొట్టకండి.. అందరం కలిసి పనిచేద్దాం.. మోహన్ బాబు వ్యాఖ్యలు

pragya Jaiswal: రోజులు లెక్క‌పెడుతున్నాను అంటోన్న ప్ర‌గ్యా.. అందాల భామ‌కు ఎంత క‌ష్ట‌మొచ్చిందో..

Viral Video: పులితో జెండర్‌ రివీల్‌ చేయడమా? వెర్రి ఆలోచనకు ట్రోలింగ్‌! వీడియో