Biopic: ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన క్రికెట్‌ లెజెండ్‌ బయోపిక్‌ మూవీ.. ఒకేసారి నాలుగు భాషల్లో..

|

Feb 20, 2021 | 11:41 AM

Kapil Dev Biopic Releasing Date Out: ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నాడు కలిప్‌దేవ్‌. భారత్‌కు తొలిసారి వరల్డ్‌ కప్‌ అందించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కపిల్‌దేవ్...

Biopic: ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన క్రికెట్‌ లెజెండ్‌ బయోపిక్‌ మూవీ.. ఒకేసారి నాలుగు భాషల్లో..
Follow us on

Kapil Dev Biopic Releasing Date Out: ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నాడు కలిప్‌దేవ్‌. భారత్‌కు తొలిసారి వరల్డ్‌ కప్‌ అందించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కపిల్‌దేవ్‌ తర్వాత వచ్చిన ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు.
ఇలా టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టిన కపిల్‌దేవ్‌ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు ఓ బయోపిక్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 1983లో వరల్డ్‌ కప్‌ సాధించడంతో దానికి చిహ్నంగానే ఈ సినిమాకు ’83’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కపిల్‌ దేవ్‌ పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. ఇక కపిల్‌ భార్యగా దీపికా పదుకొణె కనిపించనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా విడుదల చేస్తోంది. ఇక చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కానుంది. ఈ చిత్రాన్ని జూన్‌ 4న హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాష, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తాజాగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో అలనాటి మేటి ఆటగాళ్లు.. సునీల్‌ గవస్కార్‌ పాత్రలో తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు.

Also Read: Unfinished: న్యూయార్క్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ లిస్ట్‌లో.. ప్రియాంక ‘అన్‌ఫినిష్డ్’ పుస్తకం..
Vijay Hazare Trophy 2021 : క్రికెట్ అభిమానులకు పండగే పండగ.. నేటి నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ.. ఆరు జట్ల మధ్య హోరాహోరి పోరు..