ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్, బసవతారకం ప్రోమో

| Edited By:

Feb 20, 2019 | 12:42 PM

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవితాధారంగా బయోపిక్ ను రెండు భాగాలుగా తీసిన విషయం తెలిసిందే. మొదటిభాగం ఎన్టీఆర్ కథనాయకుడు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కాగా.. ఇక రెండో భాగమైన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన సందర్భంలో కీలక ఘట్టాలను ఈ చిత్రంలో రూపొందించారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రోమోను చిత్ర […]

ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్, బసవతారకం ప్రోమో
Follow us on

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవితాధారంగా బయోపిక్ ను రెండు భాగాలుగా తీసిన విషయం తెలిసిందే. మొదటిభాగం ఎన్టీఆర్ కథనాయకుడు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కాగా.. ఇక రెండో భాగమైన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన సందర్భంలో కీలక ఘట్టాలను ఈ చిత్రంలో రూపొందించారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘నా ప్రాణాలకు ప్రాణంగా.. నా బిడ్డలకు తల్లిగా.. నా సహధర్మచారిణిగా.. నీ అనుమతి కావాలి తారకం..ఇష్టమేనా?’ అంటూ బాలకృష్ణ అడగగా.. విద్యాబాలన్‌ ‘నీకూ నాకూ రెండు ఇష్టాలు ఉంటాయా..? బావా అన్న డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించగా.. ఎన్బీకే ఫిలింస్ బ్యానర్ పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.