Ilayaraja Clarity : సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రసాద్ స్టూడియోకు కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం కోర్టు వరకు వెళ్లడంతో ప్రసాద్ స్టూడియోకి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆవేశంతో ఇళయరాజా పద్మ అవార్డును వెనక్కి ఇస్తున్నారని పుకార్లు వినిపించాయి. అంతేకాకుండా ఈ విషయంలో కొందరు ప్రసాద్ స్టూడియో వారిని సమర్థించగా కొందరు ఇళయరాజాకు మద్దతుగా నిలిచారు. దీంతో పలు సినీ పరిశ్రమల్లో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
అయితే పద్మ అవార్డు వెనక్కి ఇస్తున్న పుకార్లపై ఇళయరాజా స్పందించారు. అవార్డును వెనక్కు ఇవ్వబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఎవరో కావాలని నా గురించి ఇలాంటి తప్పుడు కథనాలు అల్లుతున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు వచ్చిన సమయంలో చాలా మంది ఇళయరాజా ను ఆ విషయం ప్రశ్నించేందుకు కాల్స్ చేశారట. అందుకే ఆయనే స్వయంగా స్పందించాడు. ప్రసాద్ స్టూడియో వారితో వివాదానికి స్వస్థి చెప్పడంతో పాటు పద్మ అవార్డు విషయంలో కూడా ఇళయరాజా క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానుల్లో ఉన్న ప్రశ్నలన్నింటికి సమాధానం లభించినట్లయ్యింది.
రికార్డుల వేటలో ఎన్టీఆర్.. రామరాజు ఫర్ బీం టీజర్‌కు 30 మిలియన్ వ్యూస్ అండ్ కౌంటింగ్.!