Watch Video: అర్జున్ రెడ్డి లేకపోతే కబీర్ సింగ్ లేడు.. విజయ్ దేవరకొండకు ముద్దు పెట్టి, థ్యాంక్స్ చెప్పిన షాహిద్ కపూర్
మంగళవారం ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో స్లేట్ కార్యక్రమంలో హీరో షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి లేకపోతే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సోలో హిట్ కబీర్ సింగ్ వచ్చేది కాదన్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సందీప్ రెడ్డి డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే.

బాలీవుడ్స్ స్టార్స్ తెలుగు సినిమా రిమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించారు. మంగళవారం ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో స్లేట్ కార్యక్రమంలో హీరో షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి లేకపోతే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సోలో హిట్ కబీర్ సింగ్ వచ్చేది కాదన్నారు. కాగా ఈ రెండు సినిమాలకు సందీప్ రెడ్డి డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో హోస్ట్ చేస్తున్న షాహిద్ విజయ్ ను వేదికపైకి ఆహ్వానించి బుగ్గపై ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్పాడు. వీరి సందడి ప్రొగ్రామ్ కే హైలైట్ గా నిలిచింది.
షాహిద్ విజయ్ భుజాల మీద తల వాల్చి “నేను విజయ్ కు చాలా ప్రేమను ఇవ్వాలి. నా అర్జున్ రెడ్డి బానీ హోతి, నా కబీర్ సింగ్ పైడా హోతా (అర్జున్ రెడ్డి తీయకపోతే కబీర్ సింగ్ పుట్టేది కాదు) థాంక్యూ విజయ్! అంటూ స్పందించాడు. అర్జున్ రెడ్డి మూవీ హిందీ రీమేక్ గా కబీర్ సింగ్ ఆకట్టుకుంది. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీని బాలీవుడ్ లో రిమేక్ చేయగా కబీర్ సింగ్ మరింత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం 2019 లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ .379.02 కోట్లు రాబట్టింది. ఈ మూవీ ఎంత హిట్ అయ్యిందో.. అంతకంటే ఎక్కువగా వివాదంలో నిలిచింది. ఇక విజయ్ ఫ్యామిలీ సూపర్ స్టార్ లో కనిపించనుండగా, షాహిద్ అశ్వత్థామ అనే సినిమాలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సచిన్ బి.రవి దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ “పేరుకు తగ్గట్టుగానే ఈ చిత్రం మహాభారతంలోని అశ్వత్థామ కథ. ఆయన అమరుడు అని నేటికీ నమ్ముతారు. అశ్వత్థామ పాత్ర చిన్నప్పటి నుంచి నన్ను ఎంతగానో ఆకట్టుకుందని, ఈ పాత్ర గురించి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఎట్టకేలకు ఈ సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఎదురుచూస్తున్నాను” అన్నారు.
#KabirSingh and #ArjunReddy Love ❤️#ShahidKapoor with #FamilyStar team #VijayDevarakonda and #MrunalThakur at #PrimeVideoPresents event. pic.twitter.com/sCvkAvuw8h
— Ashwani kumar (@BorntobeAshwani) March 19, 2024
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.