Pushpa The Rise : స్టైలిష్ స్టార్ నుంచి రీసెంట్ గానే ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్.. ఏ ముహూర్తాన సుకుమార్ బన్నీని ఐకాన్ స్టార్ అని అనౌన్స్ చేశాడో కానీ బన్నీ క్రేజ్ దేశాలు దాటిపోయింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఆ ఇమేజ్ ను ఎక్కడా వాడుకోకుండా సొంతగా ఎదిగాడు బన్నీ. ప్రస్తుతం బన్నీ కి ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు బన్నీ తెలుగులో మాత్రమే సినిమాలు చేశాడు. అయినా మనోడి ఫాలోయింగ్ మలయాళం దాకా పాకింది. బన్నీ సినిమాలు మలయాళంలో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో అక్కడి ప్రేక్షకులను అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అంటూ ముద్దగా పిలుచుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల బన్నీ సినిమాలు హిందీ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. బన్నీ సినిమాలో యూట్యూబ్ లో హిందీలోకి డబ్ అయ్యి భారీ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురం లో సినిమా బన్నీ బాలీవుడ్ మార్కెట్ అమాంతం పెంచేసిందనే చెప్పాలి.
ఇలా నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ లో, మాలీవుడ్ లో అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. పుష్ప సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా రేస్ లో నిలిచిన బన్నీ భారీ విజయాన్ని అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ తో బన్నీ ఒక్కసారిగా రైజ్ అయ్యాడు. పుష్ప సినిమా ఐదు భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప మేనియానే కనిపిస్తుంది. టాప్ సెలబ్రెటీలనుంచి , స్టార్ క్రికెటర్స్ వరకు అందరూ పుష్ప సినిమాలో పాటలను, డైలాగ్ లను వీడియోలుగా చేస్తున్నారంటే బన్నీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.. పుష్ప సినిమాతో అన్ని భాషల్లో అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బాలీవుడ్ లో పుష్ప సినిమాకు అక్కడి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇక తమిళ్, కన్నడ , మలయాళ భాషలు గురించి చెప్పాల్సిన పనిలేదు.. అక్కడ బన్నీకి వీరాభిమానులు భారీగానే ఉన్నారు. ఒకేఒక్క పాన్ ఇండియా సినిమాతో ఏకంగా దేశాలు దాటే క్రేజ్ ను అందుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులే కాకుండా ఇతర దేశాల ఫాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పుష్ప లో బన్నీ చెప్పిన .. పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటివా.. ఫైరు.. అన్న మాదిరిగా ఎగసి పడుతుంది బన్నీ క్రేజ్.
మరిన్ని ఇక్కడ చదవండి :