నా థియేటర్లను ఇప్పట్లో తెరవను: సురేష్ బాబు

| Edited By:

Jul 29, 2020 | 7:06 PM

అన్‌లాక్‌డౌన్‌ 3.0లో భాగంగా ఆగష్టు 1 నుంచి సినిమా థియేటర్లు, జిమ్‌లు తెరిచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో థియేటర్ యజమానులు రెడీ అయిపోతున్నారు.

నా థియేటర్లను ఇప్పట్లో తెరవను: సురేష్ బాబు
Follow us on

Suresh Babu on theaters open: అన్‌లాక్‌డౌన్‌ 3.0లో భాగంగా ఆగష్టు 1 నుంచి సినిమా థియేటర్లు, జిమ్‌లు తెరిచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో థియేటర్ యజమానులు రెడీ అయిపోతున్నారు. గత ఐదు నెలలుగా థియేటర్లు మూత పడటంతో భారీగా నష్టపోయిన వారు.. మూవీలు విడుదలైతే కొంతలో కొంతైనా లాభపడొచ్చని భావిస్తున్నారు. అయితే తన సినిమా థియేటర్లను మాత్రం తెరవనంటారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ దగ్గుబాటి సురేష్‌ బాబు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనాలుగు వందలకు పైగా థియేటర్లను సురేష్ బాబు లీజుకు తీసుకోగా.. వాటిని ఇప్పట్లో తెరవలేనని ఆయన అన్నారు. ”ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లను తెరవడం చాలా రిస్క్‌తో కూడుకొన్న పని. కరోనా వైరస్‌ కేసులు రోజుకు పెరుగుతుండగా.. మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చొబెట్టి, వారి జీవితాలను రిస్క్‌లో పెట్టలేము. చైనాలో కేసులు తగ్గుముఖం పట్టడంతో మొదట థియేటర్లను ప్రారంభించారు. కానీ మళ్లీ మూసేశారు. ఈ సమయంలో బిజినెస్‌ గురించి ఆలోచించకూడదు. దీని వలన మేము నష్టపోవచ్చు కానీ ప్రజల ఆరోగ్యంతో ఆడుకోలేము. ఇక్కడి ప్రభుత్వాలు కూడా థియేటర్లను తెరిచేందుకు అనుమతిని ఇవ్వరని భావిస్తున్నా” అని చెప్పుకొచ్చారు. అంతేకాదు భౌతిక దూరం పాటిస్తూ తక్కువ మందికి అనుమతి ఇవ్వడం వలన నిర్మాతలకు నష్టం చేకూరుతుంది. అందుకే సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఆగడం మంచిది అని దగ్గుబాటి సురేష్‌ బాబు తెలిపారు. కాగా ఈ నిర్మాత ప్రస్తుతం రానా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Read This Story Also: బాబు పచ్చి అవకాశవాది.. నిప్పులు చెరిగిన ఒమర్ అబ్దుల్లా