Sushant Singh: సుశాంత్‌పై హృతిక్ తల్లి కీలక పోస్ట్‌

| Edited By:

Oct 24, 2020 | 11:17 AM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుతో పాటు ఎన్సీబీ, ఈడీ విచారణ జరుగుతోంది.

Sushant Singh: సుశాంత్‌పై హృతిక్ తల్లి కీలక పోస్ట్‌
Follow us on

Sushant Singh Rajput: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుతో పాటు ఎన్సీబీ, ఈడీ విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు సుశాంత్‌కి న్యాయం జరగాలంటూ చేస్తోన్న క్యాంపైన్ కొనసాగుతోంది. సుశాంత్ అభిమానులతో పాటు కొంతమంది రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ క్యాంపైన్‌లో ఉన్నారు. సుశాంత్‌ గురించి వీరంతా సోషల్ మీడియాలో గలమెత్తుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్, సుశాంత్‌పై స్పందించారు. సుశాంత్‌ ఫొటోను షేర్ చేసిన పింకీ.. ప్రతి ఒక్కరికి నిజం కావాలి. కానీ ఎవ్వరూ నిజాయితీగా ఉండటం లేదు అని ఓ కోట్‌ని పెట్టారు. ఆ పోస్ట్‌కి నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. బాలీవుడ్‌లో మీ కుటుంబం బెస్ట్ అని, సుశాంత్‌కి మద్దతు ఇస్తున్నందుకు థ్యాంక్స్ అని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో సుశాంత్‌ మరణించారు. ఆయన మృతి ఇప్పటికీ మిస్టరీగానే మారింది.

Read More:

ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ చూపించిన కాజల్‌

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా 1,273 పాజిటివ్ కేసులు.. 5 మరణాలు