ఆ పరువు హత్య ఆధారంగా చైతూ ‘లవ్‌ స్టోరీ’..?

| Edited By: Ravi Kiran

Feb 08, 2020 | 11:17 AM

నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటోన్న ఈ మూవీని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉండగా.. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఓ పరువు హత్య ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. […]

ఆ పరువు హత్య ఆధారంగా చైతూ లవ్‌ స్టోరీ..?
Follow us on

నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటోన్న ఈ మూవీని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉండగా.. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఓ పరువు హత్య ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.

ఇందులో సాయి పల్లవి అగ్ర కులానికి చెందిన అమ్మాయి పాత్రలో, చైతూ దిగువ కులానికి చెందిన అబ్బాయి పాత్రలో కనిపించనునన్నాడట. ఇటీవల కాలంలో జరిగిన పలు పరువు హత్యల ఆధారంగా శేఖర్ కమ్ముల ఈ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నెగిటివ్ ఎండింగ్ కూడా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా మరాఠీలో విజయం సాధించిన సైరాట్ చిత్రం కూడా ఇలాంటి కథాంశంతో తెరకెక్కినదే కావడం విశేషం. మరి ఇందులో నిజమెంత..? చైతూ సినిమాకు నెగిటివ్ ఎండింగ్ ఉండబోతుందా..? అనే వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.