పవన్‌ కోసం హరీష్ సెంటిమెంట్.. ఏంటో తెలుసా..!

పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పవన్ 28వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీకి నటీనటులను ఎంచుకునే పనిలో పడ్డారు దర్శకుడు హరీష్ శంకర్. ఇదిలా ఉంటే మామూలుగా సెంటిమెంట్లను బాగా నమ్మే హరీష్.. ఈ మూవీ కోసం కూడా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా తన సినిమాలకు […]

పవన్‌ కోసం హరీష్ సెంటిమెంట్.. ఏంటో తెలుసా..!

పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పవన్ 28వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీకి నటీనటులను ఎంచుకునే పనిలో పడ్డారు దర్శకుడు హరీష్ శంకర్. ఇదిలా ఉంటే మామూలుగా సెంటిమెంట్లను బాగా నమ్మే హరీష్.. ఈ మూవీ కోసం కూడా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా తన సినిమాలకు కలిసొచ్చిన పూజా హెగ్డేను పెట్టుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం.

అయితే హరీష్ దర్శకత్వం వహించిన డీజే, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో పూజా హెగ్డే నటించింది. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఈ నేపథ్యంలో పవన్ మూవీ కోసం ఆమెనే ఫిక్స్ అయినట్లు టాక్. అంతేకాదు ఇందులో నటించేందుకు పూజా కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పూజాతో పాటు మరో హీరోయిన్‌గా కియారా అద్వానీని కూడా సంప్రదించారని.. ఆమె కూడా ఇందులో నటించేందుకు ఒప్పుకుందని సమాచారం. వీటితో పాటు ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు టాక్. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక గబ్బర్‌సింగ్ తరువాత పవన్-హరీష్ క్రేజీ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై టాాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Published On - 9:32 pm, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu