Young Tiger Junior NTR : హోమ్ ఐసోలేషన్లో ఉంటూనే.. గ్లోబల్ రేంజ్ లో సౌండ్ ఇచ్చారు నందమూరి తారక రాముడు. చాలా గ్యాప్ తర్వాత ఇంటర్నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు తారక్. వాటన్నిటిలోకీ ఫ్యాన్స్ ని బాగా గిలిగింతలు పెట్టే మాట ఒకటుంది. తారక్ హాలీవుడ్ సినిమా… అనే ఆ సౌండ్ అభిమానుల గుండెల్లో ఇప్పటికీ రీసౌండ్ ఇస్తోంది. బంగారు కలల్ని పండిస్తోంది. పాన్ ఇండియా సినిమానానా పచ్చిపులుసా…! అన్నంత తేలిగ్గా కొట్టిపారేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. పాన్ ఇండియా అనే మాటే తనకు నచ్చదని ఇటీవల ఇంటర్వ్యూలో కొట్టినట్టు చెప్పేశారు తారక్. తన సినిమాల్ని అలా పిలిపించుకోవాలన్న ఆశ కూడా తనకు లేదన్నారు. కానీ.. హాలీవుడ్ సినిమా చేసే ఆలోచన ఏదైనా ఉందా అని అడిగితే.. వస్తే చూద్దాం బ్రదర్… అంటూ చిన్నగా నవ్వేశారట. చేస్తున్న ప్రతి సినిమానీ నిన్నటి సినిమా కంటే బెటర్ గా నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తున్న తారక్ కి హాలీవుడ్ ఎంతో దూరంలో లేదన్నది ఒకానొక ఒపీనియన్. కొమరం భీం గెటప్ కోసం 18 నెలలు కష్టపడి 9 కిలోలు పెరిగానన్న తారక్.. తన ఫిజిక్ పట్ల, కెరీర్ పట్ల చాలా కమిట్మెంట్ తో వుంటారు. అంతమాత్రం చేత.. ఏకంగా హాలీవుడ్ దాకా నిచ్చెనలేస్తారా అనే విమర్శలు కూడా లేకపోలేదు. గతంలో ప్రభాస్ కూడా ఇదే హైప్ ని ఎంజాయ్ చేశారు.
ఇంటర్నేషనల్ మూవీ చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ అటువంటి ఎగ్జయిటింగ్ ఆఫర్ ఏదైనా వస్తే వెల్ కమ్ చేస్తా అని.. బాహుబలి రిలీజ్ టైంలోనే చెప్పారు డార్లింగ్ ప్రభాస్. కానీ… యూనివర్సల్ అప్పీల్ వున్న స్క్రిప్ట్ తో ఇండియన్ ఫిలిం చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. ఇప్పుడు చేస్తున్న ఆదిపురుష్ ఇంగ్లీష్ వెర్షన్ ని హాలీవుడ్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో వున్నారు ఓం రవుత్. ప్రభాస్ కి తాను బిగ్ ఫ్యాన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ‘బ్లాక్ పాంథర్’ ఫేమ్ విన్ స్టన్ డ్యూక్… టెర్మినేటర్ లాంటి సాలిడ్ ఏక్షన్ థ్రిల్లర్స్ లో ప్రభాస్ ను చూసుకోబోతున్నాం అని హింట్ కూడా ఇచ్చేశారు. అది జస్ట్ హింట్ దగ్గరే ఆగిపోయింది. గతంలో గ్లోబల్ రేంజ్ లో స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. బ్లడ్ స్టోన్ అనే హాలీవుడ్ మూవీలో ఒక గెస్ట్ రోల్ చేసి ఇక చాలనుకున్నారో ఏమో… వెనక్కొచ్చేశారు. తర్వాత ఆయన అల్లుడు ధనుష్ ఒక ఫ్రెంచ్ అడ్వెంచరస్ కామెడీ మూవీలో చేసి.. హాలీవుడ్ యాక్టర్ అనే ట్యాగ్ మాత్రం సంపాదించుకున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా లియనార్డో డికాప్రియోతో కలిసి ‘The Great Gatsby’ మూవీలో ఒకేఒక్క సీన్లో చేశారు. అంతకుమించి మనోళ్లకు హాలీవుడ్ గేట్లు పెద్దగా తెచ్చుకున్న దాఖలా లేదు. అయినా థింక్ బిగ్ అనేది ఎక్కడా ఎప్పుడూ తప్పు కాదు.